Advertisement
వానా కాలంలోఅనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వానా కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. వానా కాలంలో కొన్ని కూరగాయలు తీసుకోకపోవడమే మంచిది. వానా కాలంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వానా కాలంలో పొరపాటున కూడా ఈ కూరగాయలను తీసుకోవద్దు. పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు వానా కాలంలో అసలు మంచిది కాదు. ఈ సమయంలో కూరగాయల్లో ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వాన కాలంలో ఈ విధమైన కూరగాయల్ని తీసుకోవడం వలన కడుపు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డయేరియా, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
Advertisement
Also read:
Advertisement
ముల్లంగి, క్యారెట్, బంగాళదుంప వంటి రూట్ వెజిటేబుల్స్ తేమ ఉన్న రోజుల్లో తినకండి. ఇలాంటి దుంప కూరగాయలు తింటే నష్టాలు తప్పవు. ఈ సమయంలో వంకాయలకు పురుగు పట్టకుండా ఉండేందుకు రైతులు విషపూరిత రసాయనాలను వాడుతారు. దాని వలన నష్టాలు ఎదురవుతాయి. వానా కాలంలో పుట్టగొడుగులని కూడా అస్సలు తీసుకోకూడదు. వీటిలో వ్యాధుల్ని కలిగించే గుణాలు ఉంటాయి.
Also read:
వానా కాలంలో బీన్స్ కి కూడా దూరంగా ఉండాలి. వర్షాకాలం ప్రారంభంలో బీన్స్ లో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి వీటిని అస్సలు తీసుకోకూడదు. అలాగే వానా కాలంలో కూరగాయలను నీటితో బాగా కడిగి వినియోగించాలి. సరైన ఉష్ణోగ్రత వద్ద వంట చేయడం అవసరం. కాకరకాయ, గుమ్మడికాయ, రొయ్యలు వంటి వాటిని తింటే మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!