Advertisement
పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చావు తప్పదు. ఎప్పుడు పుడతాం ఎప్పుడు మరణిస్తాం అనేది మన చేతుల్లో ఉండదు. అంతా భగవంతుడు చేతుల్లోనే ఉంటుంది. అయితే మరణించిన తర్వాత మరణించిన వారి వస్తువులని కొన్ని మనం ఉపయోగించకూడదు. మరి మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఏవి ఉపయోగించకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం..
Advertisement
గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించి కొన్ని విషయాలని చెప్పారు. మనిషి జీవించి ఉండగా వాళ్లు ఉపయోగించిన వస్తువుల్ని వాళ్ళు చనిపోయాక అస్సలు ఉపయోగించకూడదని అన్నారు. మరణించిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తితో పాటుగా ఆ వ్యక్తి తాలూకా కొన్ని వస్తువులను కూడా మనం వాడకూడదని ఆ వ్యక్తితోనే వాడుకలో ఉండకూడదని అన్నారు. మరణించిన వారు వారి వస్తువులను తీసుకువెళ్లలేరు. కేవలం పాపాలని పుణ్యాలని మాత్రమే మరణించిన వ్యక్తి తీసుకువెళ్తాడు.
Advertisement
బతికున్నప్పుడు మంచి పనులు చేస్తే మరణ సమయంలో ఏ కష్టాలు కూడా ఉండవు. అయితే ఏ వస్తువులని వాడకూడనేది చూస్తే.. చనిపోయిన వారి బంగారాన్ని ఉపయోగించకండి ఒకవేళ కనుక బంగారం మీ దగ్గర ఉంటే దానిని మార్చేసుకోవడం మంచిది. చనిపోయిన వ్యక్తి తాలూకా బంగారాన్ని మీరు వాడకండి. చనిపోయిన వ్యక్తి దుస్తులను కూడా మరొకరు వేసుకోకూడదు. ఆ బట్టలను దానం చేయడం మంచిది. ఇంట్లో కూడా ఉంచకూడదు.
చనిపోయిన వ్యక్తులు దుస్తులు ఎందుకు వేసుకోకూడదు అంటే వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వారికి నచ్చిన బట్టలు ఉంటే వాటి మీద కోరికలు ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా దానిని పొందుదామని చూస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ని కూడా పెట్టుకోకూడదు.
ఒకవేళ కనుక దాన్ని మీరు ధరిస్తే మీ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చనిపోయిన వ్యక్తికి నచ్చిన వస్తువులని మీరు కనుక ఉపయోగించారు అంటే మీపై ప్రతికూల శక్తి పడుతుంది కాబట్టి మీరు ఉపయోగించకపోవడమే మంచిది.
Also read:
తొలి ఏకాదశి నాడు ఇలా దీపారాధన చేస్తే.. డబ్బుకి లోటు ఉండదు..!