Advertisement
ఈ అలవాట్లు మీ మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. ఎప్పుడైనా ఇవి పొరపాటున చేస్తే ఇక మీదట చెయ్యద్దు. మన అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన ఆలోచనలు నియంత్రిస్తాయి. సరైన అలవాట్లు కలిగి ఉన్నట్లయితే మెదడు సరిగ్గా పని చేస్తుంది. మెదడు పనితీరును దెబ్బతీసే అలవాట్ల గురించి ఇప్పుడే చూసేద్దాం. నీరు తాగకపోవడం అనేది పలు సమస్యలకి కారణం అవుతుంది. తక్కువ నీళ్లు తాగడంతో డిహైడ్రేషన్ సమస్య వస్తుంది మెదడు పనితీరు కూడా బాగా దెబ్బతింటుంది. అలాగే సూర్యకాంతిలో అస్సలు ఉండకపోవడం కూడా మెదడు పని తీరుపై నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. కాసేపు సూర్యకాంతిలో గడపడం వలన మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
Advertisement
అధిక ఒత్తిడి వలన సమస్యలు ఎక్కువవుతాయి. ఒత్తిడి పెరిగే కొద్దీ ఆలోచించే సామర్థ్యం తగ్గుతుంది. మెదడు పనితీరు సరిగ్గా ఉండదు. సిగరెట్ ఎక్కువగా తీసుకోవడం వలన పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆలోచన విధానం బాగా దెబ్బతింటుంది ఎక్కువసేపు ఒకే చోట అలా కూర్చుని ఉండడం వలన పలు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సోమరితనం. సోమరితనం కారణంగా మెదడు సరిగ్గా పనిచేయదు. గుండె, కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
Advertisement
Also read:
అలాగే హెడ్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన పలు సమస్యలు వస్తాయి. మెదడు పనితీరుపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హెడ్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది. సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడిపితే మానసిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎక్కువ సేపు గేమ్స్ ఆడటం లేదంటే రీల్స్ చూడడం అస్సలు మంచిది కాదు. ఎక్కువగా తింటే కూడా మెదడు పనితీరు సరిగ్గా పనిచేయదు. మోతాదుకు మించి తింటే మెదడుకు రక్త సరఫరా సరిగ్గా జరగదు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!