Advertisement
కార్తీకమాసంలో కొన్ని తప్పులు చేయకుండా.. కొన్ని ఆచారాలని పాటించడం వలన మంచి జరుగుతుంది. అని నెలల్లో కంటే కార్తీకమాసం చాలా గొప్పది. కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది అని పండితులు చెప్తున్నారు. ఈ నెలలో చన్నీటి స్నానం చేయడం, దానం, జపం, దీపారాధన వంటి వాటికి ఎంతో గొప్ప ఫలితం ఉంటుందట. పైగా శివ కేశవులకి కార్తీకమాసం అంటే చాలా ఇష్టం. ఈ నెలలో భక్తులు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. మరి భక్తులు ఎటువంటి వాటిని ఆచరించాలి అనే దాని గురించి చూద్దాం.
Advertisement
నదులు, సముద్రాల్లో స్నానం చేయడం చాలా మంచిదట. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, దీపం, దానం వంటి వాటికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శివ కేశవులకి ప్రీతిపాత్రం కావడం వలన ఈ నెలలో సోమవారం దీపారాధన శనివారం విష్ణు ఆరాధన చేస్తే మంచిదట. అలాగే కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజలకి కూడా మంచి ఫలితం ఉంటుంది.
Advertisement
Also read:
కార్తీకమాసంలో ఆదివారం నాడు చేసే పూజలకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం మాంసాహారం తినకుండా కులదేవతని పూజిస్తే మంచిదట. సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేస్తే కూడా మంచితట. అలాగే కొంతమందికి తరతరాలుగా దోషాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కార్తీకమాసంలో దానికి సంబంధించిన స్తోత్రాలని భక్తుశ్రద్ధలతో పఠిస్తే సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. శత్రు బాధలు పోవడానికి దుర్గా స్తోత్రం పారాయణం చేయడం మంచిది. నిరుద్యోగులు, ఉద్యోగం కోసం చూస్తున్నవాళ్ళు కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!