Advertisement
వర్షాకాలంలో గాలిలో తేమశాతం ఎక్కువ ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఫంగస్ పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఫంగస్ పెరుగుదలకు అనువైన పరిస్థితిగా మారుతుంది. ఇది తాజా ఉత్పత్తుల్ని కూడా పాడు చేస్తుంది. వర్షాకాలంలో పండ్లు కూరగాయలకి ఫంగస్ పట్టకుండా ఉంచడానికి కొన్ని చిట్కాలని పాటించండి. సరిగ్గా వాటిని నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు సరైన విధంగా స్టోర్ చేసుకోవాలి.
Advertisement
గాలి చొరబడని కంటైనర్లలో నిలువ చేయండి. ఆకుకూరలు వంటి వాటిని పేపర్ టవల్నో చుట్టి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. పండ్లు కూరగాయలను ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయకండి రెగ్యులర్ గా రిఫ్రిజిరేటర్ ను క్లీన్ చేస్తూ ఉండండి. ఫ్రిజ్లో పాడైపోయిన ఆహారాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వారానికి ఒకసారైనా గోరువెచ్చని నీటిలో వెనిగర్, బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్ ని ఆ వాటర్ తో క్లీన్ చేయండి. వానా కాలంలో పండ్లు, కూరగాయలు తాజాగా ఉండడానికి సరైన ఉష్ణోగ్రతను నిర్వహించండి. రిఫ్రిజిరేటర్ ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వలన ఫంగస్ పెరుగుదలని నివారించవచ్చు. సాంప్రదాయ పద్ధతుల్లో పండ్లు కూరగాయలకు ఫంగస్ పట్టకుండా చేయొచ్చు. తేమ శాతాన్ని తగ్గించడానికి వర్షాలు ప్రారంభించడం ప్రారంభం అవ్వడానికి ముందు సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, పిండి పదార్థాలని ఆరబెట్టుకోండి.
Advertisement
Also read:
గాలి చొరబడని కంటైనర్లలో మాత్రమే స్టోర్ చేయండి లేదంటే అనవసరంగా ఆహార పదార్థాలు పాడైపోతాయి. పండ్లు, కూరగాయలు ధాన్యాలు మొదలైనవి ఫ్రిజ్లో నిలువ చేయండి. తేమ నియంత్రణ పండ్లు కూరగాయలను నిల్వ చేయడానికి ముందు వాటిని పొడిగా ఉండేటట్టు చూసుకోండి. కూరగాయల్ని కడిగి ఒకసారి ఆరబెట్టి పేపర్ టవల్లో చుట్టి స్టోర్ చేయడం వలన పాడైపోకుండా ఉంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!