Advertisement
దేవీ నవరాత్రుల్లో అప్పుల బాధ నుంచి ఆర్థిక సమస్యల నుంచి అమ్మవారిని విముక్తిని ప్రసాదించమని అందరూ కోరుకుంటారు. దుర్గా పూజ సమయంలో కొన్ని చిన్న తప్పులు చేస్తే ఆదాయం సమకూరడంలో ఇబ్బందులు రావడంతో పాటుగా అదృష్టం పోతుంది. మరి నవరాత్రుల సమయంలో ఎలాంటి వాటిని ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఏదో విధంగా బ్యాంకు లోన్ తిరిగి చెల్లించలేకపోతున్నట్లయితే పూజ సమయంలో దేవతకు యాలుకలను, లవంగాలను తమలపాకుతో పెట్టి తాంబూలం సమర్పించాలి. ఇలా చేయడం వలన డబ్బులు బాగా వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.
Advertisement
Advertisement
అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే డబ్బు కోసం కష్టాలు పడుతున్న వాళ్ళు సంపద కావాలంటే సప్తమి నుంచి నవమి వరకు దుర్గాదేవిని పూజించడం వలన మంచి జరుగుతుంది. తమలపాకుపై గులాబీ రేకులను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే నవమి తర్వాత ఈ తమలపాకుల్ని నీటిలో వేయాలి. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే దుర్గా పూజ సమయంలో దేవతకు తమలపాకులను సమర్పించాలి. సమస్య పరిష్కారం అవుతుంది.
Also read:
ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తే దుష్టశక్తి ప్రవాహం వలన జీవితంలో సమస్య పెరుగుతున్నట్లయితే మహిషాసురమర్దినిని ఆశ్రయించండి. అలాగే నవరాత్రుల తొమ్మిది రోజుల్లో సాయంత్రం తమలపాకు పై కుంకుమతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తర్వాత దుర్గా స్తోత్రం చదవాలి ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!