Advertisement
తొలి ఏకాదశితోనే పండుగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు. మనం చేసే మంచి పనుల వలన పుణ్యం లభిస్తుంది. మనం చేసే తప్పులు వలన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈసారి తొలి ఏకాదశి జూన్ 24న వచ్చింది. పరమ పవిత్రంగా ఈరోజు ని భావిస్తారు. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశే ఈ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు..? ఏ విధంగా ఆచరిస్తే మంచిది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
తొలి ఏకాదశి నాడు వండిన ఆహార పదార్థాలని తినకూడదు. పుచ్చకాయ, గుమ్మడికాయ, ఉసిరికాయ, చింతపండు, పొట్లకాయ, తెల్లావాలు, మినుములు, మాంసాహారం వంటివి అసలు తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా తినకూడదు. వీటిని తీసుకుంటే మహా పాపం తగులుతుంది అంటారు. తొలి ఏకాదశి నాడు మంచం మీద నిద్రపోకూడదు. నేల మీద చేప వేసుకుని నిద్రపోవాలి.
Advertisement
ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. మన పూర్వీకులు కూడా తొలి ఏకాదశి పవిత్రమైన రోజుగా భావించి పుణ్యాన్ని పొందేవారు. విష్ణుమూర్తి పాల కడలిపై నిద్రలోకి ఈరోజు వెళతారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి శయన ఏకాదశి అని కూడా ఈ రోజుని పిలుస్తారు. హిందువులు భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తారు. ఈరోజు దీపారాధన చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
రావి ఆకుల మీద దీపం కుందులు పెట్టి దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్యం కలిగిస్తుంది. రావి చెట్టు అంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతి ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. ఇలా ఉత్తమ ఫలితాలను మీరు తొలి ఏకాదశి నాడు పొందొచ్చు.
Also read:
లంచ్ & టీ విరామ సమయంలో క్రికెటర్లు ఏం తింటారు?