Advertisement
సాధారణంగా మన శరీరంపై కొన్ని భాగాలలో నలుపు అనేది ఉంటుంది. శరీరమంతా తళతళ మెరుస్తూ ఉన్నా మోచేతి దగ్గర ఉన్న నలుపు కాస్త బెరుకుగా ఉంటుంది. మరి నలుపు ఎక్కువగా మోచేతులు, మరియు మోకాలు మీదనే ఉంటుంది. ఇలా నలుపు ఉన్న వారు ఎన్ని బ్యూటీ పార్లర్ లకు వెళ్లినా,ఎన్ని బ్యూటీ క్రీమ్స్ వాడినా తగ్గకపోతే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే నలుపు ఇట్టే మాయం అవుతుంది.. అవేంటో ఒకసారి చూద్దాం..?
Advertisement
నిమ్మరసం :
మోచేతులు మరియు మోకాలు నలుపును తగ్గించడంలో నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. కాస్త నిమ్మరసం ని తీసుకొని అందులో రోజ్ వాటర్ తో కలిపి నలుపు ఉన్న దగ్గర అప్లై చేస్తే కొద్దిరోజుల్లో నలుపు వెళ్లి తెలుపు వస్తుంది.
శనగపిండి పెరుగు :
కొద్దిగా శెనగపిండి తీసుకొని అందులో పెరుగు పోసి పేస్టులా చేసి దీన్ని నలుపు గా ఉన్న భాగాలపై అప్లై చేయాలి. ఇది మొత్తం ఆరిపోయాక నీళ్లతో క్లీన్ చేస్తే నలుపుదనం తగ్గిపోతుంది.
Advertisement
బేకింగ్ సోడా మరియు పాలు:
బేకింగ్ సోడా తీసుకొని అందులో కొద్దిగా పాలు కలిపి దాన్ని ఫ్రిజ్లో పెట్టాలి. కొంతసేపటి తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని నలుపు ఉన్న మోచేతులు మరియు మోకాళ్ళపై రాసుకుంటే వారం రోజుల్లో ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
కొబ్బరి నూనె :
కొబ్బరి నూనె కూడా శరీరంపై ఉన్నటువంటి నలుపు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె ను మోచేతులు,మోకాళ్ళ పై అప్లై చేసుకుంటే నలుపుదనం తగ్గిపోతుంది.
అలోవేరా :
అలోవెరా జెల్ తో ఒంటిపై ఉండేటటువంటి నలుపును ఇట్టే తగ్గించవచ్చు. అలోవెరా జెల్ లో కాస్త బియ్యప్పిండి కలిపి నలుపు ఉన్న భాగాలపై అప్లై చేస్తే వారం రోజుల్లో మోకాళ్ళు,మోచేతులు నిగనిగలాడతాయి.
ALSO READ;
లిఫ్ట్ లో అద్దాలని ఎందుకు ఉంచుతారో తెలుసా ? మీరు అనుకున్న కారణం మాత్రం కాదు ..!