Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. అయితే, బన్నీ కి చిరంజీవి కూతురు శ్రీజ మరదలు అవుతుందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉందని.. అది మిస్ అయిందనీ మీకు తెలుసా?
Advertisement
ఇవి కూడా చదవండి: నాని సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో. ఏమి చేస్తోందో చూడండి!
ఐకాన్ స్టార్ బన్నీ గంగోత్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ సినిమాతోనే చిరంజీవి కూతురుని కూడా ఇంట్రడ్యూస్ చెయ్యాలని అనుకున్నారట. శ్రీజ తల్లి సురేఖ కూడా ఆమెను హీరోయిన్ గా చూడాలి అని భావించారట. ఇక శ్రీజ కూడా సినిమాలోకి రావాలని, హీరోయిన్ అవ్వాలని ఇంటరెస్ట్ చూపించారు. ఈ సినిమాతో బన్నీ పక్కన నటించాలి అని అనుకున్నారు. అయితే.. మెగాస్టార్ మాత్రం తన కూతురు శ్రీజను తెరపై హీరోయిన్ గా చూపించడానికి అస్సలు ఒప్పుకోలేదు.
Advertisement
ఇవి కూడా చదవండి: కంటతడి పెట్టిస్తున్న కొత్త పెళ్లి కూతురి లేఖ… పెళ్లయ్యాక మొదటిసారి తన తల్లికి రాసిన ఈ లేఖలో ఏముందంటే..?
ఇవి కూడా చదవండి: కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!
అయితే.. సురేఖ, శ్రీజ ఇద్దరు ఈ సినిమాపై ఆశ పెట్టుకున్నారట. దానితో అల్లు అరవింద్ ని అడిగారట. అల్లు అరవింద్ కూడా ఈ సినిమా విషయమై మెగాస్టార్ ను రిక్వెస్ట్ చేసినా కూడా శ్రీజని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ఒప్పుకోలేదట. దీనితో శ్రీజ ఆ ఆశ వదిలేసుకున్నారట. దీనితో ఆ సినిమాలో అదితి ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.