Advertisement
2015లో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో వేరే చెప్పనవసరం లేదు. రఘువరన్ బి.టెక్ సినిమాలో హీరో ధనుష్‌కి అమాయకమైన తమ్ముడిగా కార్తీక్ క్యారెక్టర్ లో నటించిన కుర్రాడు అందరికీ బాగా గుర్తుండే ఉంటాడు. కార్తీక్ పాత్రలో నటించిన ఇతడు కూడా ప్రేక్షకులను బాగా కట్టుకున్నాడు. అతని అసలు పేరు హృషికేశ్. ఇక ఈ సినిమాలో కనిపించిన హృషికేశ్ అసలు బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Advertisement
హృషికేశ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు బంధువు. అలాగే ధనుష్ కి హృషికేశ్ బావవరస అవుతాడట. హృషికేశ్ తన ప్రాథమిక విద్యను PSBB స్కూల్‌లో పూర్తి చేశారు. విజువల్ కమ్యూనికేషన్‌ను మద్రాస్ యూనివర్సిటీలో అభ్యసించాడు. సినిమాల్లోకి రాకముందు ఇతను ప్రకటనలు, డాక్యుమెంటరీలలో పనిచేశాడు. వేలై ఇల్లా పట్టదారితో సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో వీఐపీ 2, పెద్దన్న, బొమ్మలకొలువు వంటి చిత్రాల్లో కూడా నటించాడు.
Advertisement
1930-1940 కాలం నాటి గొప్ప చలనచిత్ర దర్శకులు అయ్యినా S.V.రమణన్‌కు, కృష్ణస్వామి సుబ్రహ్మణ్యంలాకు హృషీకేష్ మనవడు అవుతాడు. ఇక హృషికేశ్ నటనా వృత్తితో పాటు, మంచి ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ గా కూడా చేస్తాడు. ఇతను అనేక డాక్యుమెంటరీలకు,షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంతంగా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని హృషికేశ్ తనకు కెరియర్ ఆరంభం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాడట. అందువలన ఇప్పటివరకు చిన్న బడ్జెట్ సినిమాలో కనిపించాడే తప్ప.. మరి ఏ భారీ బడ్జెట్లో కూడా హృషికేశ్ కనిపించలేదు. ప్రస్తుతం ఉనర్వుగల్ తోడర్కథై, రేక్లా సినిమాల్లో నటిస్తున్నాడు హృషికేశ్.
Also read
“సన్ ఆఫ్ సత్యమూర్తి” సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌందర్య కాంబినేషన్లో మిస్ అయినా మూవీ ఏదో తెలుసా..?
బిజినెస్ లో కూడా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న మన స్టార్ హీరోస్ ఎవరో తెలుసా..?