Advertisement
ఇటీవల కాలంలో సెలబ్రిటీ టాక్ షోలు బాగా పుట్టుకొస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టే అగ్రతారలు టీవీ షోలలో సందడి చేస్తే వచ్చే కిక్కే వేరు. గతంలో బుల్లితెరపై మాత్రమే సెలబ్రిటీ టాక్ షోను నిర్వహించి వారికి సంబంధించిన ఎన్నో విషయాలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు బుల్లితెరపై అలాగే ఓటిటీలలో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ టాక్ షో లను నిర్వహించడం లేదా, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.
Advertisement
Read also: “బాహుబలి” సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?
ఒకప్పుడు సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు చేస్తే చాలా ఆసక్తిగా చూసేవారు. కానీ ఇప్పుడు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ టీవీలకు అతుక్కునేలా చేయడంలో ఈ షోలు విజయవంతం అవుతున్నాయి. అయితే ఇలా యూట్యూబ్ ఛానల్ లకు, సెలబ్రిటీ టాక్ షోలలో పాల్గొనే అతిథులకు రెమ్యూనరేషన్ ఇస్తారా? ఇస్తే ఎంత మొత్తంలో ఇస్తారు? అనే విషయం పట్ల ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే ఇలా అన్ని రకాల షోలకి సెలబ్రిటీలు వెళ్లి ఫ్రీగా తమ గురించి అన్ని విషయాలను పంచుకుంటున్నారా? అని చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది.
Advertisement
నిజానికి ప్రతి టాక్ షో నిర్వాహకులు సెలబ్రిటీలకు తప్పకుండా డబ్బులు ఇస్తారు. ఉదాహరణకు ఆలీతో సరదాగా షో నిర్వాహకులు ప్రతి సెలబ్రిటీకి లక్ష రూపాయలు అందజేస్తుంది. అంతేకాకుండా వారి ట్రావెల్ ఎక్స్పెన్సివ్స్ కూడా భరిస్తుంది. అలాగే ఇతర టాక్ షోలకి వచ్చే సెలబ్రిటీలకు కూడా ఎంతో కొంత పారీతోషికం ఇచ్చి వారి విలువైన సమయాన్ని తమ వ్యూవర్స్ కోసం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఏదైనా ప్రమోషన్ల కోసం వచ్చే సెలబ్రిటీలకు మాత్రం ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వరు.
Read also: పోకిరి సినిమాలో “గల గల పారుతున్న గోదారిలా” ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ?
ఉదాహరణకి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి విచ్చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా డబ్బులు తీసుకోరు. ఎందుకంటే వారు తమ సొంత ప్రయోజనాల కోసం ఈ షోలకి వస్తుంటారు. ఇక మరికొందరు సినిమా ప్రమోషన్ల కోసం ఫ్రీగా వచ్చేసి ఇంటర్వ్యూలను ఇస్తుంటారు. పెద్ద సెలబ్రిటీలు కూడా ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇలా సెలబ్రిటీల ఇంటర్వ్యూల ద్వారా వచ్చే వ్యూస్ కారణంగా టాక్ షో లో నిర్వాహకులు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వీరికి ఇవేమీ పెద్దగా భారం కావు.
Read also: సబ్బు, సర్ఫ్ లేని రోజుల్లో ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసా..?