Advertisement
గర్భ నిర్ధారణ పరీక్ష అనేది ఓ మహిళకు అత్యంత ఆందోళనకరమైన సమయం. జీవితంలో ప్రతి మగువ తల్లి కావాలని కోరుకుంటుంది. అందుకోసం సర్వస్వం అర్పిస్తుంది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పుట్టబోయే బిడ్డ కోసం అనుక్షణం తాపత్రేయపడుతుంది. అయితే ప్రస్తుత కాలంలో గర్భం ధరించిందో లేదో తెలుసుకోవడానికి అనేక రకాల పద్ధతులు వచ్చాయి. కానీ పూర్వం ఇలాంటి శాస్త్రీయ పద్ధతులు ఉండేవి కావు. 3 వేల ఏళ్ల క్రితం ఈజిప్ట్ లో స్త్రీలు గర్భం దాల్చినట్టు అనిపిస్తే వారి మూత్రాన్ని గోధుమ గింజల పై పోసే వారట. అలా వారం రోజుల లోపు అవి మొలకెత్తితే వారు గర్భం దాల్చినట్లు నిర్ధారించే వారట.
Advertisement
Advertisement
ఇది నేటి పరీక్షలతో పోల్చితే 70% కచ్చితంగా ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక 16వ శతాబ్ది వైద్యుడు జాక్ గిల్మవు కంటిలో వచ్చిన రంగును బట్టి గర్భధారణ ను నిర్ధారించే వారట. ఇక 16వ శతాబ్దంలోనే మూత్రం రంగును బట్టి పుట్టే బిడ్డ ఆడ, మగ అనేది కూడా చెప్పేవారట. ఇక 1920లో ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు ఓ గర్భిణీ మూత్రాన్ని కుందేలులో ఎక్కించినట్లయితే దానిలో గర్భాశయ వృద్ధి కనబడుతుందని.. ఇది పూర్తిగా పెరగని, పిల్ల కుందేలులలో కూడా గమనించారు.
కానీ ఇలా ఒక గర్భ పరీక్ష కోసం రెండు మూడు కుందేళ్లు చనిపోయేవట. ఇక 1970 లలో చేసే పరీక్షలలో టెస్ట్ ట్యూబుల్లో నమూనా సేకరణ చేసేవారు. ఇందులో గొర్రె రక్తం, హెచ్సిజి ప్రతి దేహం (యాంటీబాడీ) లను కలిపి, అందులో మూత్ర నమూనా చేర్చి.. అప్పుడు కణాలు గడ్డకడితే గర్భం లేదని, ఒకవేళ గడ్డ కట్టకపోతే గర్భమని సూచన చేసేవారు. కానీ ఇప్పటి రోజులలో అలా కాదు. ఎన్ని రోజులకు ప్రసవం అనే విషయాన్ని కూడా ముందే ప్రకటిస్తున్నారు. దీంతో బిడ్డను కనేందుకు రోజులు లెక్కపెట్టుకుంటున్నారు.
Read also: ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోస్ !