Advertisement
సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ టాలీవుడ్ హీరోలు మెగా, నందమూరి అభిమానుల మధ్య తరచూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఓ విషయం పై ఇరు వర్గాల అభిమానులు తిట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి ఈ రెండు గ్యాంగ్ ల మధ్య వివాదం తలెత్తింది. ఇటీవల జరిగిన స్కంద మూవీ ఈవెంట్ లో బాలకృష్ణ హీరోయిన్ శ్రీలీలను ఆశీర్వదించాడు.
Advertisement
ఇక్కడే అసలు విషయం జరిగిందనే చెప్పాలి. భగవంత్ కేసరి మూవీలో వీరిద్దరూ కలిసి తండ్రీ, కూతుళ్లుగా నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద మూవీ ఈవెంట్ లో బాలయ్య దగ్గరికి వచ్చిన శ్రీలీలను బాలయ్య ఆశీర్వదించాడు. బాలయ్య చాలా గ్రేట్.. కేవలం ఆశీర్వదించాడని. అలింగనం చేసుకొని Ro మాంటిక్ గా మాత్రం చూడలేదు అంటూ నందమూరి అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి హీరోయిన్ కీర్తి సురేష్ ని హగ్ చేసుకున్నాడు.
Advertisement
చిరంజీవి కీర్తి సురేష్ ఫోటోలను షేర్ చేసి ట్రోలింగ్ ప్రారంభించారు నెటిజన్లు. భోళాశంకర్ ఈవెంట్లో చిరు చేష్టలు, మాటలను కీర్తి సురేష్ తో చిరు చేసి చిలిపి చేష్టలను నందమూరి అభిమానులు ఆ సమయంలో ఎంత ట్రోల్ చేశారో.. నెగటివ్ కామెంట్స్ చేశారో దాదాపు అందరికీ తెలిసిందే. కూతురు వయస్సు ఉన్నటువంటి హీరోయిన్, చెల్లిగా నటించిన హీరోయిన్ తో ఆ వేషాలు ఏంటి అని ప్రశ్నించారు కొంత మంది. ఇప్పుడు అదే వివాదం మళ్లీ తెరమీదికి తీసుకొచ్చారు. తమ హీరో నటసింహం బాలయ్య అయితే ఎంత హుందా ప్రవర్తించారో చూడండి అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. బాలయ్య ఫ్యాన్స్ ప్రారంభించిన ఈ ట్రోలింగ్ లో మెగా అభిమానులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
Also Read :
ALLU ARJUN : అల్లు అర్జున్ కి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం చెత్త నిర్ణయమా..?