Advertisement
సాధారణంగా మనిషి రెండు చాలా ముఖ్యమైనవి. ఒకటి వారు ప్రపంచంలోకి ప్రవేశించిన రోజు అనగా పుట్టిన రోజు. మరొకటి అతను ప్రపంచాన్ని విడిచిపెట్టిన రోజు మరణించిన రోజు. జననం, మరణం. పుట్టిన తర్వాత బారసాల, అన్నప్రసన్న, మరణాంతరం అంత్యక్రియలు మానవ జోక్యం లేకుండానే జరిగిపోతాయి. అంత్యక్రియలు జరిగేటప్పుడు కొన్ని ఆచారాలుంటాయి. వాటిలో ఒకటి కుండ పగులగొట్టడం. రెండు రంధ్రాలు పెట్టిన తర్వాత కుండ పగలగొట్టడం. అలా చేయడం వెనుక దాగి ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా మనిషి సగటు జీవిత కాలం పూర్వకాలంలో 120 సంవత్సరాలు. ప్రస్తుతం అది కేవలం 60 సంవత్సరాలకు పరిమితమైంది. రానురాను తగ్గుకుంటూ వచ్చింది. 120 నుంచి 100, 80, 70 ఇలా చేరుకుంది. వాస్తవం ఏంటంటే.. మనిషికి మరణం ఎప్పుడూ లేదా ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవ్వరూ కూడా ఊహించలేరు. బలవంతంగా మరణాలు, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు మనిషి పడే జీవితం అనే తపనలో చివరికి జరిగేది శ్వాస ఆగిపోవడం.మనిషి చనిపోయిన తరువాత , అతని ఆత్మ మనిషి లోపలికి వెళ్లి అతని అంతక్రియల వరకు మళ్లీ లేవడానికి ప్రయత్నిస్తుంది.శరీరం ఆత్మ రెండు వేర్వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే ఆ మనిషి కచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే బతికే ఉండాలి.
Advertisement
చనిపోయిన తర్వాత ఆత్మ చెబితే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్ళతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు మనిషి ఆత్మ. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మనలో నుండి బయటకు వెళ్ళిపోతుందో అలాగే కుండలో ఉండే నీరు కూడా మెల్ల మెల్లగా బయటకు వెళ్లిపోవడానికి రంద్రాలను పెడతారు. కుండ పగలకొట్టడానికి కారణం ఏంటి అంటే ఇంకా ఆత్మకు శరీరంకు సంబంధం లేదు. ఇప్పుడు శరీరం ను కాల్చేస్తున్నాము అని. కావున , ఆత్మను వెళ్ళిపొమ్మని చెప్పడం. ఇలా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు మాత్రమే కాదు, మనిషి ఆచారం ప్రకారం చేసే ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. కానీ ఇందులో దాదాపు చాలా వాటికి మనకి కారణాలు తెలియదు.
మరికొన్ని ముఖ్య వార్తలు :