Advertisement
తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ గురించి చాలామందికి తెలియదు నిజానికి ప్రతి ఒక్క మగవాడి విజయం వెనక ఒక ఆమె ఉంటుంది అని అంటుంటారు. రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుండే ఉద్యమకారుడిగా మారిపోయారు. పెయింటర్ నుండి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయకేతనం ఆయన నేతృత్వంలో ఎగురవేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది. రేవంత్ రెడ్డి విజయానికి కారణం ఆయన పడ్డ కష్టం. ఆయన కష్టం వెనుక ఆయన భార్య కూడా ఉన్నారు. వీరిది ప్రేమ వివాహం ఇక వీళ్ళ ప్రేమ గురించి, పెళ్లి గురించి చూద్దాం. 1969లో నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి గ్రామంలో రేవంత్ రెడ్డి పుట్టారు.
Advertisement
స్టూడెంట్‌గా గా వున్నప్పుడు, ఏబీవీపీ లీడర్ గా వున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి ఉద్యమాలు నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా ఈయన ప్రొగ్రెసివ్‌గా ఉన్నారు. ఆ టైం లో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడు కుమార్తె గీతా రెడ్డి ని ప్రేమించారు. వీళ్ళు కాలేజీ చదువుకునే రోజుల్లోనే లవ్ చేసుకున్నారు. ఈ విషయం గీతారెడ్డి నాన్నకు తెలిసి, రేవంత్ రెడ్డికి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టం లేక ఢిల్లీలో ఉన్న తన సోదరుడు జైపాల్ రెడ్డి వద్దకు పంపించేశారు. ఆ టైం లో ప్రేమను దక్కించుకోవడం కోసం వెనక్కు తగ్గలేదట. జైపాల్ రెడ్డితోనే రాయబారం చేసుకుని రేవంత్ ఒప్పించుకున్నారు. జైపాల్ రెడ్డి రేవంత్ భవిష్యత్తులో మంచి నేత అవుతాడని అన్నారట.
Advertisement
ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఆయన ఆ తరవాత అడుగుపెట్టారు. నెమ్మదిగా అందులోనే ఎదిగారు. రేవంత్ రెడ్డి 2004లో టీడీపీలో చేరారు. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. గెలిచారు. 2009లో టీడీపీ నుండి కొండగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఈయన గెలిచారు. 2014లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. 2019 లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేసారు. ఆయన ఎంపీగా గెలిచారు. 2021లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నిలిచాడు. అప్పటి నుండీ కూడా తెలంగాణలో అధికారాన్ని చేపట్టే స్థాయికి చేరుకున్నారు. కష్టం, విజయం వెనుక ఆయన భార్య గీతా రెడ్డి ఉందని కూడా ఆయన చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!