Advertisement
ఒడిశాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 300 కి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిపుణుల బృందం ఇచ్చిన రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ప్రమాదం జరగడానికి అసలు కారణాలు బయటపడ్డాయి.
Advertisement
నిపుణులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. గార్డ్ బ్రేక్ వ్యాన్, హాల్ కోచ్ లు మెయిన్ లైన్ పై ఉన్నాయి. కోరమాండల్ రైలుకి తొలుత సిగ్నల్ లభించింది. తరువాత సిగ్నల్ ఆగిపోయింది. దీంతో కోరమాండల్ రాంగ్ ట్రాక్ పైకి వచ్చింది. కోరమాండల్ కి సిగ్నల్ లభించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోరమాండల్ కి చెందిన మొత్తం 21 బోగీలు పట్టాలు తప్పాయి. లూప్ లైన్ లో ఉన్నటువంటి గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. అదేవిధంగా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ కి వెళ్తోంది.
ఇదే సమయంలో బాలేశ్వర్ దగ్గర యశ్వంత్ పూర్ పట్టాలు తప్పింది. దీంతో కొన్ని బోగీలు పట్టాలపై పడిపోయాయి. పడిపోయిన బోగీలను 128 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో కొన్ని బోగీలు కిందపడ్డాయి. బోల్తా పడిన బోగీలను పక్క ట్రాక్ పై వెళ్తున్న గూడ్స్ రైలు ఢీ కొట్టింది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
తాజాగా ఈ ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక విషయాలను వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని వెల్లడించారు. రైల్వే భద్రత విభాగ కమిషనర్ ఈ సంఘటనకు సంబందించిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టారని.. దీనికి బాధ్యులను కూడా గుర్తించినట్టు తెలిపారు. త్వరలోనే పూర్తి నివేదిక వస్తుందని తెలిపారు. బుధవారం వరకు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఆ తరువాత రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి అశ్విని వైష్ణవ్.
మరికొన్ని ముఖ్య వార్తలు :
మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
పెళ్లై ఇద్దరూ పిల్లలు.. ఈ మహిళ ఇలా చేస్తుందని అస్సలు ఊహించి ఉండరు..!
అంత్యక్రియలు జరిగేటప్పుడు చితికి నిప్పంటించిన వ్యక్తి వెనక్కి చూడకూడదంటారు.. ఎందుకో తెలుసా ?