Advertisement
సాధారణంగా పిల్లలు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఆహారం తినే విషయంలో చాలా మారం చేస్తారు.. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఏదో రకంగా మెస్మరైజ్ చేసి వారికి ఆహారం తినిపిస్తారు.. ముఖ్యంగా ఈ పిల్లలు గుడ్డు తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం..? చిన్న పిల్లలకు ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తినిపించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా రోజుకు ఒక గుడ్డు తినే పిల్లలు వేగంగా ఎదుగుతారని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో తేలింది.
Advertisement
గుడ్డులో ఉన్నటువంటి పోషక పదార్థాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిల్లల యొక్క శారీరక ఎదుగుదలను పెంచేందుకు ఈ గుడ్డు ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆరు నుంచి తొమ్మిది నెలల పసికందులకు రోజుకు ఒక్క గుడ్డు తప్పక ఇవ్వాల్సిందే. ఈ విధంగా గుడ్డు తినే వారితో తినని వారిని పోలిస్తే, తినే వారి ఎదుగుదల చాలా స్పీడ్ గా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Advertisement
ఇందులో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఏబీసీడీఈ, క్యాల్షియం, పాస్పరస్, జింకు తదితర పోషక పదార్థాలు పిల్లలకే కాకుండా అన్ని వయసుల వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. గుడ్డులో ఉండే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ డి ఎముకల దృఢత్వానికి, విటమిన్ ఈ క్యాన్సర్ నుండి కాపాడుతుంది. గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి గుడ్డును పిల్లలకి తినిపించడం వల్ల వారు బలంగా, ఆరోగ్యంగా ఎదుగుతారని డాక్టర్స్ తెలియజేస్తున్నారు.
also read;