Advertisement
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, అంతా మంచే జరుగుతుందని నమ్మకం. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం తులసి కోటకు పూజలు చేస్తారు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఇక తులసి ఆకులతో కూడా అనేక లాభాలు ఉంటాయి. దీనిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు.
Advertisement
Read also: చనిపోయిన ప్రేయసిని పెళ్లాడిన ప్రియుడు!
Advertisement
తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓసీమమ్ టెన్యూయి ఫ్లోరోమ్. అంతేకాక ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక తులసి మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయని కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. దీంతో తులసికి ఆయుర్వేదంలో కూడా మంచి ప్రాధాన్యం ఇస్తారు. అయితే తులసి మొక్కతో పాటు ఇతర మొక్కలను పెంచకూడదని చెబుతున్నారు. తులసి మొక్కకు ఉత్తమమైన ప్రదేశం తూర్పున ఉండగా.. మీరు దానిని బాల్కనీలో లేదా ఉత్తరాన, లేదా ఈశాన్య దిశలో కిటికీ దగ్గర ఉంచవచ్చు.
అయితే తులసిని ఒంటరిగానే ఉంచాలి. పొరపాటున కూడా తులసితో ఇతర చెట్లను పెంచకూడదు. తులసి మొక్కతో పాటు ఇతర మొక్కలను పెంచితే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలా వేరే మొక్కలను నాటడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తులసి మొక్కతో పాటు కాక్టస్ మొక్కను ఎప్పుడూ నాటొద్దు. ఇంట్లో అలంకరణకు కొంత వైవిధ్యాన్ని జోడించడానికి వివిధ రకాల కాక్టస్ మొక్కలను నాటుతూ ఉంటారు. ఇలా తులసి మొక్క పక్కన కాక్టస్ మొక్కను నాటడం వల్ల తులసి మొక్క క్రమంగా క్షణిస్తుంది. అందుకే ఈ మొక్కను తులసి పక్కన పెట్టకూడదని చెబుతున్నారు.