Advertisement
యార్లగడ్డ సుప్రియ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె అక్కినేని నాగార్జున మేనకోడలిగా అన్నపూర్ణ స్టూడియోస్ ను ఒంటిచేతితో నడిపిస్తుంది. అయితే అంతకు ముందులా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వరుస సినిమాలు తీయడం లేదు. మళ్లీ దానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది సుప్రియ. కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదల చేసింది సుప్రియ.
Advertisement
చాయ్ బిస్కెట్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బాయ్స్ హాస్టల్ మూవీని రిలీజ్ చేసింది. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ తరుణంలో చాయ్ బిస్కేట్ నిర్మాత శరత్ చంద్ర.. ఈ మధ్యే ఓ యూట్యూబర్ తో వివాదానికి దిగినట్టు వార్తలు వినిపించాయి. యూట్యూబర్ ని శరత్ ఇష్టంవచ్చినట్టు మాట్లాడాడని.. తొక్కేస్తా.. కేసు వేస్తా నీ ఛానెల్ లేపేస్తా అంటూ బెదిరించాడని చెప్పుకొచ్చారు. ఈ వివాదం సోషల్ మీడియానే షేక్ చేసిందనే చెప్పాలి. ఈ వివాదాన్ని సద్దుమణిగించే బాధ్యతలను సుప్రియ తీసుకుంది.
Advertisement
బాయ్స్ హాస్టల్ సక్సెస్ మీట్ లో ఓ విలేకరీ ఇదే విషయాన్ని శరత్ చంద్రను ప్రశ్నించగా.. ఆయన స్థానంలో సుప్రియ సమాధానం చెప్పింది. ” శరత్ చంద్ర వాళ్లకి గీర ఎక్కువ అండీ.. ఏదైనా అంటే.. ఫస్ట్ లాజిక్ ఒకటి ఎవరైనా అంటే.. వీళ్లు రెండు లాజిక్ లు ఎదురుచెప్పాలి. అది చెప్పేవరకు శరత్ కి నిద్ర పట్టదు. అది చెప్పాలి. ప్రూవ్ అవ్వాలి” అని చెప్పుకొచ్చింది సుప్రియ. సినిమా విషయంలో పాజిటివ్ రివ్యూస్ తీసుకున్నప్పుడు.. నెగిటివ్ రివ్యూస్ ఎందుకు తీసుకోరు అనే ప్రశ్నకు సుప్రియ స్పందిస్తూ.. “తీసుకోలేక పోయే పరిస్థితి మీరు కల్పించరు. తీసుకోవాల్సిందే. సినిమా మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు.. మీరే దానికి బ్రాండ్ అంబాసిడర్లు” అని చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సుప్రియ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read :
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి ఇష్టమైన స్టార్ హీరోస్ ఎవరంటే..?