Advertisement
దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఇండియా వైజ్ ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అంతేకాదు ఈ తరం సినిమాలలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీలో వచ్చినప్పటికీ సినిమా వచ్చిన ప్రతిసారి చూస్తుంటే కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఓ సరికొత్త కంటెంట్ ని క్రియేట్ చేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పేలా తెరకెక్కించారు జక్కన్న.
Advertisement
Advertisement
ఇక ఈ చిత్రంలోని పాత్రల విషయానికి వస్తే ప్రతి పాత్రకు ఆయా నటులు ప్రాణం పోశారనే చెప్పాలి. రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర, సత్యరాజ్ చేసిన కరికాల కట్టప్ప పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచాయి. రాజ్యానికి నమ్మిన బంటులా ఉంటూ ఆయన పాత్ర సినిమాను మార్చేస్తోంది. రెండో భాగం అంత హైప్ రావడానికి కట్టప్ప పాత్ర కీలకం. అయితే ఈ పాత్ర కోసం ముందుగా సత్యరాజ్ ని అనుకోలేదట. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ కి కట్టప్ప పాత్ర చేసే అవకాశం వచ్చిందంట.
ఈ పాత్రకు మోహన్ లాల్ అయితేనే న్యాయం చేయగలరని రాజమౌళి అనుకున్నారట. కానీ మోహన్ లాల్ ఈ పాత్ర విన్న తర్వాత రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ పాత్రకి ఎంతోమంది నటీనటులను చూస్ చేసుకోగా.. చివరికి రమా రాజమౌళి సత్యరాజ్ ను ఈ పాత్రకు ఫైనల్ చేశారట. సత్యరాజ్ ఈ పాత్ర గురించి వినగానే ఓకే చెప్పేసారట. అలా ఈ సినిమా విడుదలైన తరువాత ఆ పాత్రకి చాలా పేరు వచ్చింది. దాంతో మోహన్ లాల్ పాత్ర చేస్తే ఇంకా హైలైట్ గా ఉండేది అని మోహన్ లాల్ కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం.
Read also: తారకరత్న ప్రాణాలు కాపాడడానికి తెరవెనుక శ్రమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?