Advertisement
కళాతపస్వి కే విశ్వనాథ్ తెరకెక్కించిన అద్భుతమైన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. 1985 మార్చి 27న విడుదలైన ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా, రాధిక హీరోయిన్ గా నటించారు. స్వాతిముత్యం, భారతీయుడు వంటి సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు కమల్ హసన్. అయితే స్వాతిముత్యం చిత్రంలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కొన్న పరిస్థితులు.. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు.. ఆ తర్వాత వారిద్దరి జీవన ప్రయాణం ఎలా కొనసాగిందనేదే ఈ చిత్రం యొక్క కథ.
Advertisement
Read also: “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Advertisement
అప్పట్లోనే ఈ చిత్రం ఆస్కార్ కి వెళ్లడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి దర్శకుడు కె విశ్వనాథ్ కి ఉత్తమ జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా..? ఈయన ఎవరో కాదు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్రంలో కమల్ హాసన్ కి మనవడిగా చిన్న పాత్రలో కనిపించాడు అల్లు అర్జున్. దర్శకుడు కె విశ్వనాథ్ తో అల్లు అరవింద్ కి పరిచయం ఉండేది. దీంతో విశ్వనాధ్ షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ కూడా అప్పుడప్పుడు వెళ్ళేవారట. అలా స్వాతిముత్యం సినిమాలో నటించే చిన్న పిల్లల పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారట విశ్వనాథ్. ఓ రోజు షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి అల్లు అరవింద్ తన కుమారుడిని తీసుకువెళ్లారట.
అప్పుడు అల్లు వారి అబ్బాయిని చూసిన విశ్వనాథ్.. ” మీ అబ్బాయిని మా సినిమాలో ఒక్క చిన్న పాత్ర కోసం తీసుకోవచ్చా.. కేవలం రెండు మూడు రోజులకు మాత్రమే షూటింగ్ ఉంటుంది” అని అడిగారట. విశ్వనాధ్ వంటి దర్శకుడు అడగడంతో వెంటనే స్వాతిముత్యం సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట. అలా స్వాతిముత్యం లో లెజెండరీ నటుడు కమల్ హాసన్ కి మనవడిగా బాలనాటుడిగా నటించారు స్టైలిష్ స్టార్. ఇప్పుడు యూత్ ఐకాన్ స్టార్ గా దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. స్వాతిముత్యం మాత్రమే కాకుండా చిరంజీవి నటించిన విజేత అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించారు.
Read also: విడాకుల తర్వాత సమంత తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?