Advertisement
తరుణ్ హీరోగా కె.విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నువ్వే కావాలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 ల సంవత్సరంలో అక్టోబర్ 13న విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత 2001 సమ్మర్ పూర్తయ్యే వరకు ఆడుతూనే ఉంది.
Advertisement
చిరంజీవి,నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ఈ చిత్రం ఆడుతూనే వచ్చింది. త్రివిక్రమ్ డైలాగ్స్, కోటి సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో నటించిన తరుణ్, సాయికిరణ్ వంటి వారందరికీ మంచి గుర్తింపు లభించింది. కానీ హీరోయిన్ రిచా పల్నాడు కు మాత్రం ఈ చిత్రం పెద్దగా కలిసి రాలేదు అనే చెప్పాలి. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.
Advertisement
ఫిలింఫేర్ అవార్డు కూడా కొట్టింది. కానీ తర్వాత, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అంతేకాక చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా బెంగళూరులో పుట్టి పెరిగిన రీచా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆమె కేవలం తెలుగులోనే కాదు. మలయాళ, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2011 వ సంవత్సరంలో హిమాన్షు బజార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ జంటకి ఒక బాబు కూడా ఉన్నాడు.
Also Read : ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?