Advertisement
ప్రతి ఆడపిల్లకి తండ్రి మొదటి హీరో. ఒక ఆడపిల్ల శిశువు నుండి యుక్త వయసుకు వచ్చే వరకు ఆమె జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో తండ్రి ఒకరు. కూతురి జీవితంలో తండ్రి ప్రభావం ఆమె ఆత్మా విశ్వాసాన్ని, ఆత్మా గౌరవాన్ని, పురుషులపై అభిప్రాయాన్ని తెలిసేలా చేస్తుంది. తల్లి ఆమెకు ప్రేమను పంచితే తండ్రి కూతురుకి ధైర్యాన్ని నేర్పుతాడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను నీతో ఉంటానని ధైర్యాన్ని కూతురికి కలిగిస్తాడు తండ్రి.
Advertisement
అలాగే తండ్రి మాత్రమే ఆమెకు మద్దతు ఇవ్వగల ఏకైక వ్యక్తి. ఆమె క్షేమానికి భరోసా ఇవ్వగలడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమార్తెను వదులుకోని వ్యక్తి తండ్రి ఒక్కడే. అతని ఆప్యాయత మరియు ప్రేమ షరతులు లేనివి. ఒక తండ్రి తప్ప స్వచ్ఛమైన, విలువైన ప్రేమను ప్రపంచంలో ఎవరూ ఆడపిల్లకు అందించలేరు. అతను తన కుమార్తె అవసరాలను తీర్చడానికి ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఎంత ఎత్తుకైనా వెళ్లగలడు.
Advertisement
కుమార్తె భద్రత కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా ఉంటాడు. ఆమె తండ్రి చేతులు పట్టుకుని, దారిలో నడవడం ఆ కుమార్తెకు అపారమైన బలాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆయనకి ఎంత కష్టం ఉన్న తన బిడ్డ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. బిడ్డ తన ఇబ్బందిని చెప్పక ముందే తండ్రి తెలుసుకొని తన కష్టాన్ని తీర్చడానికి ఎప్పుడూ ముందుంటారు.
జన్మనివ్వడమే కాదు.. మంచి భవిష్యత్తును చూపే తండ్రి తమ పిల్లలకి మొదటి గురువు. అందుకే ప్రతి తండ్రి కూడా తన కూతురికి మొదటి సూపర్ హీరో అవుతారు. అలాగే కూతురు కూడా ఎంతో కష్టపడి వచ్చిన తండ్రి.. ఆయన అవసరం ఏంటో చెప్పకుండానే అర్థం చేసుకొని ఆయనకు సపరియాలు చేస్తూ అండగా నిలుస్తుంది. అందుకే కూతుర్ని అందుకే కూతుర్నే డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని అంటారు.
Also Read
కృష్ణుడికి 8 సంఖ్యతో ఉన్న ప్రత్యేక సంబంధం ఏమిటో తెలుసా ?
అసిస్టెంట్ పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!