Advertisement
సినీ ప్రేమికులకు ప్రతి శుక్రవారం ఒక పండుగే. భాష ఏదైనా కానీ శుక్రవారం మాత్రమే సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తుంటాయి. శుక్రవారం వస్తుందంటే చాలు సినీ అభిమానులు థియేటర్లకి పరుగులు తీస్తుంటారు. అయితే శుక్రవారం రోజునే సినిమా ఎందుకు విడుదల అవుతుంది..? వేరే రోజున ఎందుకు విడుదల కాదు..? అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండబోదు. అందుకు గల కారణం ఏంటి..? అలా శుక్రవారం రోజున విడుదలైన తొలి సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.. వారం అంతా కూడా కష్టపడి వారాంతంలో సినిమాలు చూడడం అనేది అందరి జీవితాలలో సర్వసాధారణంగా జరుగుతుంది. చాలామంది సోమవారం నుండి శుక్రవారం వరకు డ్యూటీ చేసి చివరి శని, ఆదివారాలలో సినిమాలు, షికార్లు, ఇతర పనులు ఉంటే ముగించుకుంటారు.
Advertisement
Read also: మీరు ఇంతవరకు ఎప్పుడూ చూడని విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు రేర్ ఫోటోలు
ఈ క్రమంలో చాలామంది సమయం దొరికింది అంటే చాలు వారి కుటుంబం, లేదా స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి చిత్ర యూనిట్ కూడా కొత్త కొత్త సినిమాలను శుక్రవారం రోజున విడుదల చేస్తుంది. ఇది చాలా రోజుల నుండి ఆనవాయితీగా వస్తున్న ఒక సెంటిమెంట్. సినిమాలు ప్రారంభమైన కొత్తలో అమావాస్య రోజులలో సినిమాలు విడుదల చేసేవారు. ఎందుకంటే వ్యవసాయం ప్రధాన జీవనాధారమైన మన దేశంలో ఆ రోజున రైతులకు పనులు ఉండవు. దీంతో ప్రజలు ఆ రోజున ఎక్కువ సంఖ్యలో థియేటర్ల వద్దకు వస్తారనే ఉద్దేశంతో ఆ విధంగా చేసేవారు. ఆ తరువాత కాలక్రమంలో ప్రజలు ఇతర వృత్తులను ఎంచుకోవడం, శని, ఆదివారాలు సెలవు రోజులుగా మారడం జరిగింది. దీంతో శుక్రవారం రోజు సినిమాలను విడుదల చేయడం ప్రారంభించారు.
Advertisement
ఇక హాలీవుడ్ లో అలా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా ” గాన్ విత్ ది ఎండ్”. 1939 డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదలైంది. ఇక ప్రస్తుతం ఈ పద్ధతినే ఇండియాలో కూడా పాటిస్తున్నారు. అయితే ఈ పద్ధతి ఇండియాలో మొదట్లో అంతగా పాటించలేదు. 1950 ముందు వరకు ఏ సినిమా కూడా శుక్రవారం విడుదల అయ్యేది కాదట. కానీ మొట్టమొదటిసారిగా శుక్రవారం మన భారతదేశంలో విడుదలైన సినిమా “మొగల్ ఏ అజీమ్”. ఈ చిత్రం తర్వాత అన్ని సినిమాలు కూడా శుక్రవారం విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే శుక్రవారాన్ని భారతీయులు లక్ష్మీదేవితో పోలుస్తారు. అలా శుక్రవారం విడుదలైన సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తాయనే నమ్మకం కూడా ఉంది. అలా మనదేశంలో సినిమాల విడుదల శుక్రవారాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.
Read also: చిరంజీవికే వణుకు పుట్టించిన వెంకీ మామ సినిమా ఎదో తెలుసా ?