Advertisement
హైందవ సంస్కృతి సాంప్రదాయంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు అనేక సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రతి ఇంట్లోనూ దాదాపు ప్రతిరోజు భక్తితో భగవంతుడి ఎదుట దీపం వెలిగించి స్వామిని ఆరాధించడం అనేది విధిగా చేస్తూ ఉంటాము. ఏదైనా పండుగలు వచ్చినా.. ప్రత్యేక సందర్భాలు వచ్చిన పూజలు నిర్వహిస్తాము. అయితే పూజల సమయంలో దేవుడిని ఆరాధించేవారు కచ్చితంగా పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, నైవేద్యాలను కచ్చితంగా సమర్పిస్తారు. అయితే భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలు ఉన్నా మొదటి ప్రాముఖ్యత అరటిపండు, కొబ్బరికాయకు ఇస్తారు.
Advertisement
Advertisement
అందువల్ల వాటిని పూర్ణ ఫలాలు అని పిలుస్తారు. అయితే అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం. ఈ సృష్టిలో అన్ని ఫలాలను మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి పడతాయి. మరికొన్ని పండ్లను పక్షులు తిని వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అలా అవి మళ్లీ మొలకెత్తి తిరిగి పుష్పించి ఫలాలవుతాయి. అలా వచ్చిన ఫలాలను మనం తిరిగి మళ్లీ భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్టం కాదు అంటున్నారు పండితులు. కానీ కొబ్బరికాయ మాత్రం తిని పడేసిన పెంకు నుంచి గాని, ముందే వలిచిన పీచు నుంచి కానీ మొలకెత్తే అవకాశం లేదు.
ఇక కొబ్బరికాయను భగవంతునికి సమర్పించుకోవడం వెనుక పరమార్థం కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు. ఇక అరటి చెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలచిన పండ్లను ఇస్తుంది. అందువల్ల అరటిపండు, కొబ్బరికాయలు పూర్ణఫలాలు అయ్యాయి. ఇక కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో అరిష్టం జరిగిపోతుందని అంతా భయపడతారు. కానీ అదంతా ఆపనమ్మకం మాత్రమే. కొబ్బరికాయ పగిలితే కనిపించేంత స్వచ్ఛమైన మనసుతో దేవుడిని ప్రార్థిస్తే చాలు అంటారు పండితులు.