Advertisement
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దేవదాసు అనే సినిమాతో చిన్న వయసులోనే తెలుగు తెరకు పరిచయమైన రామ్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు. తన ఎనర్జీ, డాన్స్, హ్యాండ్సమ్ లుక్, యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్. దేవదాసు చిత్రం తర్వాత రెడీ, జగడం, గణేష్, మస్కా, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్, ది వారియర్ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. 15 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు రామ్.
Advertisement
Advertisement
రామ్ పోతినేనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన ఒక్కో సినిమాకి 30 కోట్ల నుండి 40 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. అయితే ఆయన సినిమాలకి డైరెక్టర్స్ ముందుగా ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ ని, లేక సినిమా కంప్లీట్ అయ్యాక ఇచ్చిన ఫైనల్ అమౌంట్ ని.. రామ్ తన అకౌంట్ లో ఉంచుకోరట. అమౌంట్ అకౌంట్ లో పడిన మరుక్షణమే తన అమ్మ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారట. తన అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోవడం ఆయనకు ఇష్టం ఉండదట. దానికి కారణం ఏంటంటే.. చిన్నప్పటినుండి ఆయన తల్లిదండ్రులు ఆయనను ఎంతో కష్టపడి పెంచారని.. ముఖ్యంగా ఆయన తల్లి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని తనని ఈ స్థాయికి తీసుకు వచ్చిందని.. ఆ కారణంగానే రామ్ పోతినేని డబ్బు విషయంలో ” మా అమ్మే నాకు డబ్బులు ఇవ్వాలి కానీ నేను మా అమ్మకి ఇవ్వకూడదు. వాళ్లు నన్ను అడగడానికి మొహమాట పడకూడదు” అన్న కారణంగా మొత్తం అమౌంట్ ని వాళ్ళకి ఇచ్చేస్తారట.
ఆయనకి ఏ అవసరం వచ్చినా వాళ్ళ అమ్మని అడిగి తీసుకుంటారు తప్పితే స్వతహాగా ఎప్పుడూ తీసుకోరట. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం అంటున్నారు ఆయన అభిమానులు. ఇక రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరా బరిలోకి రామ్ పోతినేని వచ్చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇటు రామ్, అటు బోయపాటి శ్రీను క్రేజ్ పీక్స్ కి చేరుకుంటుందనడంలో సందేహం లేదు.
Read also: ఈ లక్షణాలున్న అబ్బాయి లను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?