Advertisement
సాధారణంగా రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్లకు ఇరువైపులా చెట్లను చూసే ఉంటాం. ఆ చెట్లను చూస్తుంటే మనకు మంచి ఆహ్లాదం అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మరి ఆ చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేసి ఉంటాయి. మరి ఆ పెయింట్ లు ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం..?
Advertisement
రహదారి వెంబడి ఉండేటువంటి చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేస్తారు అంటే అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన ట్రీస్ అని అర్థం. ఇవి అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని సంకేతం. వృక్షాలను అటవీశాఖ వారే ప్రత్యేకంగా రక్షిస్తున్నారు అన్నమాట. ఇలాంటి చెట్లకు మనం ఏ విధమైన హాని తలపెట్టిన ప్రభుత్వపరంగా చర్యలు అనేవి ఉంటాయి.
Advertisement
అలాగే అందరూ సులువుగా గుర్తించడం కోసమే ఈ రంగులను వేస్తారు. ఇక తెలుపు రంగు పెయింట్ ఎందుకు వేస్తారు అంటే రాత్రిపూట ఈ చెట్లు ప్రయాణికులకు సులభంగా కనిపించాలని తెలుపు రంగును చెట్ల కింద భాగంలో వేస్తారు. ఈ తెలుపు రంగు పైన కొంత భాగం ఎరుపు రంగు పెయింట్ వేస్తారు. ఎందుకంటే భూమిలోంచి క్రిమికీటకాలు చెట్టు ఎక్కి పాడు చేస్తాయని చెట్టు మొదటి భాగం నుంచి పెయింట్ వేసి వదిలేస్తారు. దీని వల్ల చెట్లు సురక్షితంగా ఉంటాయి. ఈ పెయింట్ వల్ల చెట్లు కూడా త్వరగా దెబ్బతినకుండా ఉంటాయని చెబుతున్నారు.