Advertisement
చాలామంది డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లో గొలుసు కట్టు రాతలే ఉంటాయి. వైద్య విద్య పూర్తయ్య లోపు వాళ్ల చేతిరాతలో చాలా మార్పులు వచ్చేస్తాయి. వీలైనంత తక్కువ టైంలో రాయడానికి అనువుగా ఉండేలా చాలా ప్రధాన స్కిప్ చేసేస్తూ రాయటం మొదలుపెడతారు. అదే కోడ్ లాంగ్వేజ్ అని చూసే వాళ్ళకి అనుమానం వచ్చేలా మారిపోతుంది ఆ రాత. పోనీ డాక్టర్ అయ్యాక ఏమన్నా రాయటం తగ్గుతుందా అంటే లేదు.
Advertisement
READ ALSO : పవన్ కళ్యాణ్ “సత్యాగ్రహి” సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే..!!
మన దేశంలో సగటున ఓ ఎంబిబిఎస్ డాక్టర్ రోజుకు 30 నుంచి 35 మంది పేషంట్లకు వైద్యం అందిస్తారంట. బిజీగా ఉండే కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రాసే అక్షరాలపై పట్టు కోల్పోతుంటారు. వాళ్లకు బాగా రాయాలని ఉన్న అక్షరాలు రాస్తున్నప్పుడు అవి జారిపోతుంటాయి. పట్టు కోల్పోవడం లాంటి సమస్య ఇది. తెలియకుండానే అక్షరాలు వేగంగా పడిపోతుంటాయి. ఫలితంగా గొలుసు కట్టు రాతల్లా కనిపిస్తుంటాయి.
Advertisement
READ ALSO : కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?
మనదేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి శాతం చూస్తే చాలా తక్కువ. ప్రతి 1,000 మందికి కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉంటున్నారు. సో ప్రతి రోగికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం వైద్యులకు కష్టమైన పనే. రోగి సమస్యలను శ్రద్ధగా వింటూ వాళ్ళు చెబుతున్నది జాగ్రత్తగా నోట్ చేస్తూ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది అది కూడా వేగంగా. ఫలితంగా వైద్యుల చేతిరాతపై ఈ అంశం ప్రభావం చూపిస్తోందని చెబుతారు.
READ ALSO : నటనలోనే కాదు డాన్సుల్లోనూ ఒక ఊపు ఊపేసిన 10 స్టార్ హీరోయిన్స్