Advertisement
నిద్రపోయినప్పుడు ప్రతి ఒక్కరికి కలలు రావడం సహజం. ఒక్కోసారి మనకి విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి సాధారణ కలలు వస్తూ ఉంటాయి. అయితే బిల్డింగ్ పై నుండి పడిపోయినట్లు కూడా అప్పుడప్పుడు కలలు వస్తూ ఉంటాయి. బిల్డింగ్ పై నుండి పడిపోయినట్లు కల వస్తే దానికి అర్థం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. అనేక కలలు మనకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి పైనుండి కింద పడిపోయినట్లు కలలు వస్తూ ఉంటాయి. మనం ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని స్వప్న శాస్త్రంలో కూడా ప్రస్తావించబడింది. ప్రతి ఒక్క కలకు ఒక్కో అర్థం ఉంటుందని పండితులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో బిల్డింగ్ పై నుండి కింద పడినట్లు కల వస్తుందని ఆ కల అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
ఎత్తయిన కొండ లేదా బిల్డింగ్ పై నుండి కింద పడినట్లు కల వస్తే చెడు సంకేతంగా భావించాలని నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి కలలు వస్తే అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఒకవేళ కింద పడ్డాక ఎలాంటి గాయాలు కాకపోతే ఎదురుగా వచ్చే ఆటంకలను విజయవంతంగా దాటేస్తారని, ఏదైనా ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఇలా కింద పడుతున్నట్లు కలలు వస్తాయని పండితులు అంటున్నారు. ఒత్తిడికి ఎక్కువగా గురైన శరీరం ఎక్కువసేపు శ్రమించిన ఇటువంటి కలలు వస్తాయని స్వప్న శాస్త్రంలో వివరించారు.
Also read:
ఒకవేళ గ్లాసులో పాలు పోసుకుని తాగుతున్నట్లు కల వచ్చిందంటే త్వరలోనే మంచి జరగబోతుందని ఆర్థికంగా ఊహించని లాభం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కలలో చేప కనపడితే ఏదో శుభకార్యం జరగబోతుందని అర్థం. మాంసం తింటున్నట్లు కల వస్తే గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. నెమలి మంచి చిహ్నమైనా కలలో కనపడితే అశుభంగా భావించాలని నిపుణులు అంటున్నారు. దీనివలన కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలట. ఒకవేళ కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనపడితే త్వరలో కష్టాల ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని దానికి అర్థం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!