Advertisement
ఎన్టీఆర్ – బాలయ్య ఫాన్స్ మధ్య వార్ ముదురుతోంది. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజులుగా ఈ ఇద్దరు నందమూరి హీరోల మధ్య వార్ ఎక్కువగా నడుస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో వీరి రచ్చ మాములుగా లేదు. ఎన్టీఆర్ , బాలకృష్ణ ఫాన్స్ హద్దు మీరి ఒకరినొకరు కామెంట్స్ చేసుకుంటూ తిట్టుకుంటున్నారు. ఇది చాలా వరకు పర్సనల్ గా వెళ్తోంది. ఎంతవరకు అంటే.. ‘ఎన్’ టాగ్ తీసేయాలి అనేంత వరకు ఈ ఫాన్స్ మధ్య వార్ నడుస్తోంది.
Advertisement
వీటిని కూడా చదవండి: నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?
నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయాలి అంటూ బాలకృష్ణ కామెంట్ చేయడం వైరల్ అయ్యింది. “ఇప్పుడే తీసేయ్” అని బాలయ్య బాబు అన్నారు. ఈ కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. ఆయన ఎన్టీఆర్ ఫ్లెక్సీలనే తీసేయమని అన్నారని అంతా అనుకుంటున్నారు. మీడియాలో కూడా ఇదే ప్రాజెక్ట్ అయ్యింది. కానీ మురళి అనే ఓ వ్యక్తి క్లారిటీ ఇచ్చారు.
Advertisement
వీటిని కూడా చదవండి : “కాంతారా” కంటే ముందే అదే కాన్సెప్ట్ తో ఓ సినిమా వచ్చిందని మీకు తెలుసా..!
వర్ధంతి రోజు స్వాగతం, సుస్వాగతం అంటూ ఫ్లెక్సీ లు ఏంటి అని? వాటిని తీసేయమని బాలయ్య బాబు చెప్పారు అంటూ బాలకృష్ణ అనుచరులు క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఈ క్లారిటీ వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వివాదానికి రాజకీయ రంగు అంటుకుంది. టీడీపీ, వైసీపీ నాయకులూ కూడా రియాక్ట్ కావడంతో ఇది మరింత వివాదాస్పదం అయ్యింది. బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసారు. నందమూరి టాగ్ తీసేస్తే..ఒక్క వంద కోట్ల సినిమా లేదని అంటున్నారు.
అప్పట్లో బాలకృష్ణ సినిమాలు చిరంజీవి సినిమాలు పోటా పోటీగా ఆడేవని, ఇప్పుడు తారక్ సినిమాలు ఎవ్వరికి పోటీ ఇవ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఎన్టీఆర్ ఒక్కడితోనే సినిమా చేయడం కష్టం కాబట్టే రామ్ చరణ్ ను తీసుకున్నారని.. అది కూడా రామ్ చరణ్ కి సపోర్టింగ్ రోల్ మాత్రమేనని.. రామ్ చరణ్ వల్లే సినిమా హిట్ అయ్యింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తనకి హిట్ లేదు అంటూ వినాయక్ ను అడిగారని, కారులో భోరున విలపిస్తేనే ఆ సినిమా తీసారని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్లుగా బాలయ్య ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్విట్టర్ క్లిప్స్ అన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.