Advertisement
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం ఊహించడం కష్టం. ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామన్. అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కూడా చాలా సహజం. ప్రేమ వివాహాలు చేసుకోవడమే కాకుండా… విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తమ క్రష్ ను పెళ్లి చేసుకున్న జంటలు ఏవో చూద్దాం.
Advertisement
Also read: SR ఎన్టీఆర్ కు ఒక్క హైదరబాద్ లోనే ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయో తెలుసా..?
#1 విగ్నేష్ శివన్- నయనతార
ఈ మధ్యకాలం లోనే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళ గురించి మొదట మాట్లాడుకుందాం. కోలీవుడ్ దర్శకుడు ప్రస్తుతం నయనతార భర్త అయిన విగ్నేష్ సినిమాల్లోకి రాకముందు నయనతార కి పెద్ద అభిమాని. డైరెక్టర్ అయ్యాక ఆమెతో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. తాను అనుకున్నట్టుగానే నయన్…’నానుమ్ రౌడీ ధాన్ ‘ అనే చిత్రం చేశాడు. అక్కడి నుంచి వీళ్ళ ప్రేమకథ మొదలైంది. నయనతార హీరోయిన్ గా ఫేడౌట్ అయిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు విగ్నేష్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమె చేయబోయే సినిమాల కథల ఎంపికలు అలాగే నయన్ లుక్స్ వంటివి విగ్నేష్ హ్యాండిల్ చేశాడు. ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. తర్వాత నయన్ బిజినెస్ వ్యవహారాలను కూడా విగ్నేష్ దగ్గరుండి చూసుకునేవాడు. ఫైనల్ గా తన క్రష్ ని పెళ్లి చేసుకున్నాడు.
#2 విక్కీ కౌశల్- కత్రినా కైఫ్
సినిమాల్లోకి రాకముందు నుండి కత్రినాకి వీరాభిమాని విక్కీ కౌశల్. ఇక సినిమాల్లోకి వచ్చాక, కత్రినా కి దగ్గరయ్యాక ఆమెను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. తనకంటే నాలుగేళ్లు చిన్నవాడు అయినప్పటికీ కత్రినా, విక్కినే పెళ్లి చేసుకుంది.
#3 రణబీర్ కపూర్ – అలియా భట్
టీనేజ్ లో ఉన్నప్పటినుండి రణబీర్ కు అలియా భట్ పెద్ద ఫ్యాన్. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నార , పెళ్లి చేసుకున్నారు.
#4 రజినీకాంత్- లత
Advertisement
అప్పట్లో లత గారు ఫిలిం జర్నలిస్ట్, రజిని ఫ్యాన్ కూడా! రజిని నీ ఇంటర్వ్యూ చేసి ఫ్లాట్ చేశారు లత గారు. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతోమందికి ఆదర్శమైన జంటగా నిలిచారు.
#5 విజయ్ – సంగీత
సంగీత – విజయ్ కు పెద్ద ఫ్యాన్. విజయ్ ను కలుసుకోవడానికి ఆమె విదేశాల నుండి వచ్చింది. విజయ్ బ్రేక్ టైం లోనే ఈమెను కలిశాడు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఇక తర్వాత సంగతి తెలిసిందేగా.
#6 మాధవన్ – సరిత
మాధవన్ కు సరిత పెద్ద ఫ్యాన్. హీరో కాకముందు కమ్యూనికేషన్ క్లాసెస్ చెప్పేవాడు మాధవన్. ఆ క్లాసులో స్టూడెంట్ గా అటెండ్ అయ్యేది సరిత. మాధవన్ హీరో అయ్యాక అతనిపై క్రష్ ఫీలింగ్ పెరిగింది. తర్వాత ఒకేసారి అతన్ని కలుసుకోవడం అది తర్వాత ప్రేమగా మారడం జరిగింది. ఫైనల్ గా వీరు పెళ్లి చేసుకున్నారు.
#7 రాజేష్ ఖన్నా – డింపుల్ కపాడియా
బాలీవుడ్ హీరో రాజేష్ కన్నా కి పెద్ద అభిమాని, డింపుల్. ఓసారి వీరు కలుసుకున్నారు. అంతే ఆ పరిచయం పెళ్లి పీటల వరకు వెళ్ళింది.
#8 దిలీప్ కుమార్ – సైరా బాను
12 ఏళ్ల వయసు నుండి దిలీప్ కు పెద్ద ఫ్యాన్స్ సైరా. చివరికి ఎలాగోలా పెళ్లి చేసేసుకుంది.
#9 అజిత్ – శాలిని
అజిత్ కు, షాలిని ఓ అభిమాని. కట్ చేస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేలా చేశాడు దేవుడు.
#10 అర్జున్ – నివేదిత
అర్జున్ కు నివేదిత అభిమాని. ఆమె కూడా హీరోయిన్ అయ్యాక అర్జున్ కు జోడిగా ఓ సినిమాలో ఎంపికైంది. ఆ సినిమా షూటింగ్ టైములో అర్జున్ కు గాయాలు అయ్యాయి. ఆ టైములో అతనికి దగ్గరుండి సేవలు చేసింది. అంతే వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది విషయం.
Also Read: “స్పైడర్ మ్యాన్” సినిమాను చైనా ఎందుకు నిషేధించింది?