Advertisement
టాలీవుడ్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “గాడ్ ఫాదర్“. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలుమార్పులు చేసి, ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. ఈ సినిమా దసరా రోజున అంటే రేపే రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే..ఈ సినిమాకి సంబంధించిన మొదటి షో దుబాయిలో కొంతమంది పాత్రికేయులకు చూపించిందట చిత్ర బృందం. ఇక వాళ్ల నుండి వచ్చిన టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది.
Advertisement
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా సరైన కంటెంట్ ఉన్న సినిమా అని, కచ్చితంగా మెగా అభిమానులకు పూనకాలు రప్పించే విధంగానే ఈ సినిమాని డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించారట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునే విధంగా చేస్తుందట. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫెర్ సినిమాకి రీమేక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. మలయాళంలో ఈ సినిమా నీడివి రెండు గంటల 50 నిమిషాలు ఉంటే అందులో హీరో మోహన్ లాల్ కేవలం 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. కానీ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి రెండు గంటల పాటు కనిపిస్తాడట. ఆయన లేని సన్నివేశాలలో కూడా చిరంజీవి మార్కు ఉండేలా డిజైన్ చేశాడట డైరెక్టర్.
Advertisement
అంతేకాకుండా ఒరిజినల్ వెర్షన్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం డైరెక్టర్ ఫాస్ట్ గా స్క్రీన్ ప్లే నడిపించినట్టు సమాచారం. అంతేకాకుండా ఒరిజినల్ వెర్షన్ లో లేని 10 క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉంటాయట. ఒకపక్క కమర్షియల్ మూవీ తీరులో గాడ్ ఫాదర్ మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ల ఉంటుందట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి కిక్ ని ఇచ్చిందో మెగాస్టార్ ఫ్యాన్స్ కి గాడ్ ఫాదర్ సినిమా కూడా అలాంటి కిక్ ని ఇస్తుందని దుబాయ్ నుండి అందుతున్న రిపోర్టు. మరి ఈ సినిమా నిజంగానే ఆకట్టుకుంటుందా.. లేక ఆచార్యలాగా దెబ్బ కొడుతుందా చూడాలి.
READ ALSO : Dil Raju : దిల్ రాజ్ తో పెళ్లిని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ !