Advertisement
ప్రపంచాన్ని అతలాకుతులం చేసిన కరోనా మహమ్మారి ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఇలా ఎంతో మంది కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త చెప్పింది. ఏపీలోని వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియమానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ,వార్డు, సచివాలయాల్లో ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Advertisement
కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు మరణించారు. వారిలో ఇప్పటివరకు 2,744 మంది కారుణ్య నియమాకాల కోసం దరఖాస్తు చేసుసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యేక డ్రైవ్ కింద అర్హులైన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో కారుణ్య నియమకాలను చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఆగస్టు 24 తేదీ వరకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సెప్టెంబర్ 30 తేదీ వరకు ఈ నియమాకాలకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని సూచించింది. ఖాళీలు, పాయింట్లు, రోస్టర్లతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ నియమకాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.