Advertisement
సీనియర్ ఎన్టీఆర్.. ఆయన ఓ నట శిఖరం, ఓ ఆత్మగౌరవం, ఓ అధ్యాయం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాలు వేరువేరు కాగా రెండింటిలోనూ సత్తా చాటి రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. కారణజన్ముడు అన్న పేరు తెచ్చుకున్నారు. అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీకి స్వర్గీయ ఎన్టీఆర్ తొలిసారి నటించి పరిచయమైన సినిమా మన దేశం.
Advertisement
Read Also : యాక్సిడెంట్ తరువాత డ్రైవర్ తో పంత్ మాట్లాడిన మొదటి మాట ఇదే! వింటే కన్నీళ్లు ఆగవు..
ఈ సినిమా 1949 లో విడుదల అవ్వగా చిత్తూర్ నాగయ్య హీరోగా నటించాడు. ఎన్టీఆర్ పోలీసుగా చిన్న పాత్రలో నటించగా, ఈ చిత్రానికి హీరోయిన్ శ్రీకృష్ణవేణి. ఈ సినిమా తర్వాత ఆమె చాలా పాపులర్ హీరోయిన్గా ఎదిగారు. ఇక కృష్ణవేణి తొలిసారి సతి అనసూయ అనే సినిమా ద్వారా తొలిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయింది. కేవలం 13 ఏళ్లకే హీరోయిన్ గా మారిన కృష్ణవేణి ఆ తర్వాత భోజ కాళిదాసు సినిమాలో కన్నాంబ మొదటి హీరోయిన్ గా నటిస్తే కృష్ణవేణి రెండో హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను మీర్జాపురం రాజావారు నిర్మించారు.
Advertisement
ఆ తర్వాత కచదేవాయనిలో దేవయాని పాత్రలో నటించింది కృష్ణవేణి. అలా తన జీవితం మొత్తం జయ ఫిలిమ్స్ వారి దగ్గరే ఉండిపోయింది. అలా వారి సినిమాలో నటిస్తూనే మీర్జాపురం రాజా వారికి రెండవ భార్యగా వెళ్ళింది. పెళ్లయ్యాక సైతం వారి సొంత సినిమాల్లో నటించింది. కొన్ని ఏళ్లకు రాజావారు కాలం చేశారు. రాణిగా వెలిగిన కృష్ణవేణికి అప్పటివరకు ఏ లోటు లేకపోయినా రాజరికపు వ్యవస్థ చచ్చిపోవడంతో వారి ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. దాంతో ఆమె తమిళనాడు ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు. ఇప్పటికీ అలా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో ప్రభుత్వం కట్టిన గన్నవరం ఎయిర్పోర్ట్ అంతా కూడా మీర్జాపురం రాజా వారి భూమే. విమానాశ్రయం కట్టడానికి ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు రాజావారు.
Read Also : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?