Advertisement
Hanuman OTT Platform and Date: హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ కొనసాగుతూ ఉంది. నైజంలోను రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. చాలామంది ఈ సినిమాని చూసేసారు అయితే కొన్ని కారణాల వలన థియేటర్ కి వెళ్లకుండా మిస్సయిన వాళ్ళు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హనుమాన్ ఓటీటీ రైట్స్ ఇంత తక్కువకి అమ్ముడు అయిపోవడం ప్రస్తుతం అందరి ఆశ్చర్యపరుస్తోంది.
Advertisement
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి రైట్స్ ని జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 30 కోట్లకి జీ ఫైవ్ హనుమాన్ సినిమా రైట్స్ ని దక్కించుకుంది. రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత స్ట్రీమ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు ఇప్పుడు సినిమా భార్య సక్సెస్ అవ్వడంతో జీ ఫైవ్ ఏదో అదృష్టం చేసుకుందనే చెప్పొచ్చు. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తయ్య దాకా సినిమా ఓటీటీ లో అపుతామని మాట ఇచ్చింది 8 వారాల తర్వాత ఓటీటీ లో స్టీమ్ చేయడానికి ఓకే చెప్పింది. మార్చి 8 నుండి ఈ సినిమా ఓటిటిలో అన్ని భాషల్లో రాబోతుంది.
Advertisement
ఇప్పటికీ సినిమా 300 కోట్ల గ్రాస్ థియేటర్ రెవెన్యూ వసూలు చేసింది ఓటీటీ లో కూడా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. తేజ ఈ సినిమాలో హీరోగా నటించగా అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. పిల్లల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం తో పాటుగా ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో కూడా రిలీజ్ కావడం విశేషం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!