Advertisement
దివంగత నటుడు హరికృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కారు ప్రమాదానికి గురై చనిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు పోలీసులు ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. హరికృష్ణ రామారావు బసవతారకం దంపతులకు 1956 సెప్టెంబర్ 2న కృష్ణాజిల్లా నిమ్మకూరులో పుట్టారు. 1974లో తాతమ్మ కల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ ఇలా చాలా సినిమాలో నటించారు. 1973లో లక్ష్మీ కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి జానకిరామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని పుట్టారు.
Advertisement
జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హరికృష్ణ మరో భార్య శాలిని, హరికృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు. సినిమాలు కంటే రాజకీయాలను హరికృష్ణ ఇష్టపడే వారు. టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత తన తండ్రి ఎన్టీఆర్ కి సపోర్ట్ చేశారు ఎన్టీఆర్ చైతన్య రథం పై రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తే ఆ వాహనాన్ని స్వయంగా హరికృష్ణ నడిపారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సక్సెస్ లని ఎంజాయ్ చేస్తూ ఎంతో గర్వంగా ఉన్న సమయంలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
Advertisement
Also read:
ఈరోజు హరికృష్ణ వర్ధంతి ఈ నేపథ్యంలో ఆయన రాసిన చివరి లేఖ వైరల్ అవుతోంది. కేరళతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితి చూడలేక హరికృష్ణ మరణానికి కొద్ది గంటల ముందు త్వరలో తన పుట్టినరోజులు నిర్వహించొద్దని అభిమానులకి ఓ లేఖ రాశారు. సెప్టెంబర్ 2న తన 60 పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు చెయ్యొద్దని ఆయన కోరారు. ఏ పుట్టినరోజు ఏర్పాట్లు చేయొద్దని ఆయన ఓ లేఖలో కోరారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!