Advertisement
కుక్కలు విశ్వాసానికి ప్రతిక, ఒక్కసారి వాటిని దగ్గరకు తీసుకుంటే మీపై ఎంతో విశ్వాసాన్ని చూపుతాయి. కానీ కొన్ని కుక్కలు మాత్రం మనుషుల్ని చూడగానే విపరీతంగా ఎగబడి దాడి చేస్తాయి. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఇక్కడ ఏ విధంగా దాడి చేస్తాయో మనకు చూశాం. మరి అలా కుక్కలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, మనం వాటి భారీ నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి టిప్స్ పాటించాలి..
Advertisement
also read: ఇప్పటంలో మళ్లీ.. ఈసారి ఏం జరగనుంది..?
విచిత్ర వేషధారణ వద్దు:
కుక్కలకు మీరు వేసుకున్న రంగుల డ్రెస్సులు ఒక్కోసారి నచ్చకపోవచ్చు. అందువల్లే అరుస్తూ ఉంటాయి. కలర్ షర్టు, నల్లని కళ్ళద్దాలు తలపై ఎర్రని టోపీ పెట్టుకుంటే కుక్కలకు వింతగా అనిపిస్తుంది దీనివల్ల అవి వెంబడిస్తాయి. కాబట్టి ఇలాంటివీ ధరించినప్పుడు కుక్కలకు కాస్త దూరంగా ఉండాలి.
also read:రేవంత్ పాదయాత్రలో టెన్షన్!
Advertisement
పరుగులు పెట్టడం చేయకండి:
కుక్కలు వెంటపడ్డ సమయంలో పరుగులు పెట్టడం వంటివి చేయరాదు. అలా పరుగులు పెడితే అది మిమ్మల్ని మరింత వెంబడించి కరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి కుక్కలను చూసి పరుగులు పెట్టకుండా ధైర్యంగా వాటిని బెదిరించే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీరు అక్కడే నిలిచి కాసేపు ఆగండి. సైలెంట్ గా ఉంటే అవి కూడా కోపానికిరావు.
కళ్లలోకి చూడడం:
మీరు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో హఠాత్తుగా కుక్కల గుంపు కనబడితే చాలామందికి ఏం చేయాలో అర్థం కాదు. వాటి వైపు అలాగే చూస్తూ ఉంటారు. కానీ అది తప్పు. వాటి కళ్లలోకి సూటిగా చూడకండి. మీ పక్కన ఎంత పెద్ద కుక్కల గుంపు ఉన్న వాటిని పట్టించుకొనట్లుగా వెళ్లిపోవాలి. వాటి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే అవి రెచ్చిపోయి మీపై దాడి చేస్తాయి.
ప్రతిఘటించడం :
కుక్కల గుంపు అరవడం చేస్తే మీరు చేసే మొదటి తప్పు పరుగు పెట్టడం, లేదంటే వాటిపై రాళ్లూరువ్వడం. ఈ రెండు ప్రమాదమే. అలా చేసి మీరు అక్కడ నిలబడ్డారంటే మీపై దాడి చేస్తాయి. ఈ సమయంలో చేతిలో కర్ర పట్టుకోండి, చేతిలో ఎలాంటి ఆయుధం లేకున్నా మీపై దాడి చేయవచ్చు.
also read: