Advertisement
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ, కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇటీవల బింబిసార చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. తాజాగా నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి తెరకేక్కించిన అమీగోస్ చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయంలో మెప్పించాడు కళ్యాణ్ రామ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనిషిని పోలిన మనుషులు ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.
Advertisement
Read also: “ఆచార్య” సినిమాలో చిరంజీవి మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?
Advertisement
ఈ మూవీ షూటింగ్ ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు కళ్యాణ్ రామ్. తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు ఎప్పుడూ ప్రస్తావించని కళ్యాణ్ రామ్ మొదటి సారి ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆమె గొప్పతనాన్ని వివరించారు. అంతేకాదు తన చేతి పై ఉన్న పచ్చబొట్టు గురించి కూడా తొలిసారి వివరించారు. ” 2007 – 2008 మధ్యకాలంలో నేను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను. ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఆ సమయంలో నా భార్య స్వాతి అన్ని దగ్గరుండి చూసుకుంది. నాకు ఒక తల్లిలా సేవలు చేసింది.
కొందరైతే నర్స్ ను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు. కానీ నా భార్య అలా చేయలేదు. నన్ను ఒక తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా చూసుకుని ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దింది. అది నా మనసుకు బాగా తాగింది. నా భార్యపై ఉన్న ప్రేమతోనే తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అసలు నేను ఇంజక్షన్ చేయించుకోవాలన్నా భయపడిపోయేవాడిని. కానీ ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ప్రేమ అధిగమించేలా చేసింది. అలా ఆమె పేరు నా చేతి మీదకు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే నా భార్య లేకపోతే నేను లేను” అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.
Read also: డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!