Advertisement
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కల ప్రపంచం. ఈ కళా ప్రపంచంలో ఎన్నో కష్టాలు, నష్టాలు,బాధలు ఉంటాయి. రంగు పూసుకొని తెరపై కనిపించే అంత ఆనందంగా ఉండే నటీనటుల జీవితంలో ఆనందాలు ఉండవు. దాని వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది.. అలాగే కొంతమంది నటీనటులు పైకి ఎంతో అందంగా కనిపించినా వీరు కొన్ని భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ వాళ్లే.
Advertisement
మరి వారు ఎవరో వారు ఏ వ్యాధుల బారిన పడ్డారో ఓ సారి చూద్దాం..
సినీ ఇండస్ట్రీలో కొంత మంది నటీనటులు పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందులో కొంత మంది ఆ వ్యాధుల నుంచి బయటపడితే మరికొంతమంది ఆ వ్యాధికి బలైపోతున్నారు. మరి వ్యాధి నుంచి బయట పడ్డ వారి గురించి ఇప్పుడు చూద్దాం..
షీలా కౌర్ :
also read:కార్ల వెనుక భాగంలో ఉండే LXi, ZXi, VXi అర్థం ఏంటో మీకు తెలుసా..?
తమిళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈ నటి తెలుగులో బన్నీ సరసన పరుగు అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు సాధించింది. దాని తర్వాత సీతాకోకచిలుక, మస్కా,అదుర్స్ వంటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధ పడి చివరికి దాని నుంచి బయట పడింది.
మమతా మోహన్ దాస్ :
Advertisement
ఈమె కూడా బ్లడ్ క్యాన్సర్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి ఆమె ధైర్యంతో దీని నుంచి బయట పడింది. ఈమె క్యాన్సర్ వ్యాధి వచ్చిన వెంటనే చిన్ననాటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా వదిలేశాడు.
మనిషా కొయిరాల :
ఈ హీరోయిన్ కూడా సర్వేకల్ క్యాన్సర్ తో పోరాడింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోని ఎలాంటి ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉంది.
సౌత్ స్టార్ గౌతమి :
ఈమె కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించిందని, గౌతమి కూడా క్యాన్సర్ నుంచి బయటపడినప్పటికీ ఆమెలాగా బాధపడుతున్న ఎంతో మంది కోసం ఫౌండేషన్ స్థాపించి సమాజ సేవ చేస్తోంది.
also read:రైల్వే ట్రాక్ పై W/L అని వ్రాసి ఉంటుంది.. దాని అర్థం ఏంటంటే..?