Advertisement
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటేడ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉండి ఉంటుంది.హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటేడ్ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఇది అంతరిక్ష, రక్షణ సంస్థలకు సంబంధించిన కంపెనీ. ఈ సంస్థ నిర్వహణ భారత రక్షణ మంత్రిత్వశాఖ వారితో నిర్వహించబడుతుంది. యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు రక్షణకి సంబంధించిన వాటిని తయారు చేస్తుంది. ఈ సంస్థను 1940లో స్థాపించారు. అప్పుడు హిందుస్థాన్ ఎయిర్ క్రాప్ట్ గా పిలిచారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటేడ్ గా పిలువబడుతుంది.
Advertisement
Advertisement
అయితే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఇప్పటికే పలు రంగాలు వృద్ధి వైపు పయణిస్తున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. భారత రక్షణ విమానయాన రంగంలోని కీలక సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటేడ్(HAL) వృద్ధిలో మరొక రికార్డును సొంతం చేసుకుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటేడ్ షేర్ ధర రూ.3857.9కి చేరింది. ఐదేళ్ల కిందట రూ.1000 లోపే ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటేడ్ షేర్ ధర.. ఐదేళ్లలోనే దాదాపు ఐదు రెట్లకు పెరగడం విశేషం.
ఐదేళ్లలో హెచ్ఏఎల్ సాధించిన ఈ విజయం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెందుతుందని ఎన్డీఏ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అనగా HAL ను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని విపక్షాలు ఇప్పటికే పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దాని షేర్ పెరగడంతో ఆ ఆరోపణలు నిరాధారమని గుర్తుచేస్తున్నాయని పేర్కొన్నారు.