Advertisement
హీరో కృష్ణంరాజు పూర్వ కాలం నుంచి రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి.. ఎంత ఉన్నా ఒక సామాన్యుడి లాగా అందరితో కలిసి పోతారు. ఎప్పుడూ చూడడానికి గంభీరంగా కనిపించే కృష్ణంరాజు.. పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన 183 పైగా చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. “చిలకా గోరింక” అనే మూవీతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు. ఆయన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డు, నంది అవార్డు ఇలా అనేక గౌరవప్రదమైన అవార్డులు గెలుచుకున్నారు. 1973లో వచ్చినటువంటి జీవనతరంగాలు సినిమా, 1974 లో వచ్చిన కృష్ణవేణి, 1978లో వచ్చిన మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించడమే కాకుండా కెరియర్లో బెస్ట్ ఫిలిమ్స్ గా నిలిచాయని చెప్పవచ్చు.
Advertisement
also read: నాకు 40… తనకు 20.! ఇది మా స్టోరి!
Advertisement
రెబల్ స్టార్ అనే బిరుదు:
ఇలా సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణంరాజుకు అభిమానులు రెబల్ స్టార్ గా బిరుదు ఇచ్చారు.. ఇక ఈ బిరుదు ఇప్పుడు ప్రభాస్ కూడా వచ్చేసింది. తన పెదనాన్న నుంచి రెబల్ స్టార్ అనే బిరుదు పొందారు.. ఇక కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే బిరుదు రావడానికి కారణం ఆయన నటించిన సినిమాల్లో కళ్ళెర్ర చేస్తూ రెబల్ గా మాట్లాడుతూ ఉండటం వల్ల ఆయనకు ఆ బిరుదు ఇచ్చారని కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు..
నేను నటించిన సినిమాల్లో కన్నెర్ర చేయడం, కత్తి అందుకో జానకి అంత సీరియస్ గా ముఖం పెట్టడం, అలాగే గంభీరమైన వాయిస్ వల్ల నా అభిమానులు నాకు రెబల్ స్టార్ అని బిరుదు ఇచ్చారని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇంతలో కృష్ణం రాజ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూయడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.
also read:రిలయన్స్ అధినేత అంబానీ ఆస్తుల్లో విలాసవంతమైన వస్తువులు ఇవే