Advertisement
బొప్పాయి చెట్టు అంటేనే అన్ని ఔషధ గుణాలు కలగలిపిన స్వచ్ఛమైన చెట్టు. బొప్పాయి చెట్టును ఒక ఔషధగని అంటారు. బొప్పాయిని పండులా తింటారు మరియు పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. బొప్పాయి ఆకులు కూడా ఔషధంగా ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిన వారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే రక్త కణాలు ఇట్టే పెరిగిపోతాయి. ఇక బొప్పాయి పండు లోని గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
also read: Apollo Fish in Telugu: అపోలో ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?
సాధారణంగా మనం బొప్పాయి పండును తిని గింజలను పడేస్తూ ఉంటాం. మరి అలాంటి బొప్పాయి గింజల వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఈ బొప్పాయి పండులో ఉంటాయి. అంతేకాకుండా వీటి లోపలి గింజల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. బొప్పాయి పండు జీర్ణవ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు, దంత సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది. 30 గింజలను రోజు తింటే రోగాలు దరిచేరవని అంటున్నారు.
Advertisement
also read:“అమ్మా ఇంకోసారి ఏడిస్తే మాత్రం గుడ్ బై చెబుతాను”.. అంటూ తారకరత్న కూతురు ఎమోషనల్ పోస్ట్..!!
ఈ గింజలు తినడం వల్ల పొట్టలోని టాక్సీన్స్ బయటకు పోతాయి. పురుషుల్లో సంతానాలేమి సమస్యలు తగ్గుతాయి. అజీర్తి సమస్యలు ఉండవు. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కొవ్వు కూడా కరుగుతుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా బొప్పాయి పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు.
Advertisement
also read: