Advertisement
దేశంలో జీఎస్టీ వసూళ్ల సంఖ్యలు నెల నెలకు పెరుగుతూ వస్తున్నాయి. జీఎస్టీ వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం చేకూరుతుంది. జులై నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.65 ట్రిలియన్ల జీఎస్టీ వసూలు చేసాయి. గత ఏడాది కంటే ఇది 11 శాతం అధికం. జీఎస్టీ ఆదాయం 1.6 ట్రిలియన్లకు పైగా రావడం ఇది ఐదోసారి అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక సంవత్సరంలో నెలవారి సగటు వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ లో 1.87 ట్రిలియన్ల రికార్డు కలెక్షన్ల తరువాత ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయ సేకరణగా అధికారులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement
ఇంటిగ్రేటేడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) నుంచి రూ.41,239 కోట్లు.. దిగుమతులపై జీఎస్టీ సెస్ ద్వారా రూ.840 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. అంతరాష్ట్ర విక్రయాల సెటిల్ మెంట్ తరువాత జులైలో కేంద్రం రూ.69,558 కోట్లు, రాష్ట్రాలు రూ.70,811 కోట్లు జీఎస్టీ ఆదాయంలో తమ వాటాగా వసూలు చేసాయని ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. జులైలో దేశీయ లావాదేవీల ఆదాయం గత ఏడాది ఈ నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయం కంటే 15 శాతం అధికం అని పేర్కొంది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రెండు ఎకరాల ఆదాయాన్ని వసూలు చేశాయి.
జులైలో ఢిల్లీ జీఎస్టీ ఆదాయంలో 25 శాతం వృద్ధితో 5,405 కోట్లకు చేరుకోగా.. యూపీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,802కోట్లకు చేరుకుంది. మహారాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 18 శాతం వృద్ధితో రూ.26,024 కోట్లకు చేరుకుంది. కర్ణాటక జీఎస్టీ వసూళ్లలో 17 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.11,505 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తమిళనాడు జులైలో రూ.10,022 కోట్ల జీఎస్టీ రాబడిని వసూలు చేసింది. 19 శాతం మెరుగుదల కనిపించింది. మరోవైపు జులైలో గుజరాత్ లో కేవలం 7 శాతం ఆదాయం మాత్రమే పెరిగింది.