Advertisement
భార్యా భర్తల బంధం చాలా పవిత్రమైనది. చాలా మంది భార్య భర్తలు తమ జీవిత భాగస్వామికి, తమకి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అని.. తమ ప్రేమ స్వచ్ఛంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ప్రేమ స్వచ్ఛమైనదే ఉండాలి కానీ.. భార్యలైనా.. భర్తలైనా అన్ని విషయాలను తమ జీవిత భాగస్వామితో పంచుకోకూడదట. అసలు ఏ వ్యక్తితోను కొన్ని విషయాలను ఎవ్వరూ చెప్పుకోకూడదు. అయితే.. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయానికి వచ్చేసరికి అనవసర అపార్ధాలకు దారితీస్తాయని అనిపించినప్పుడు కొన్ని విషయాలను తెలియనివ్వకపోవడమే మంచిదట.
Advertisement
ముఖ్యంగా భర్తలు ఒక నాలుగు విషయాలను మాత్రం తమ భార్యలకు పొరపాటున కూడా చెప్పకూడదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఈ విషయాన్నీ ఎవరు చెప్పారో తెలుసా? స్వయానా చాణుక్యుడే ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. ఇంతకీ.. చాణుక్యుడు ఏమి చెప్పాడో.. ఏ విషయాలను చెప్పకూడదని చెప్పాడో ఇప్పుడు చూద్దాం. చాణుక్యుడు ప్రతి భర్త తన ఆదాయం ఎంతో ఇంట్లో భార్యకి చెప్పకూడదట. భర్త ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. ఇంట్లో దుబారా ఖర్చులు ఎక్కువ అవుతాయట. సంపాదన ఎక్కువ అని తెలిస్తే భార్య ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతుందట.
Advertisement
ప్రతి మనిషికి ఓ బలహీనత ఉంటుంది. అయితే.. భర్తలు తమ బలహీనతలను భార్యలతో చెప్పుకోకూడదు. ఎందుకంటే ఆమె పదే పడే అతని బలహీనతల గురించి ప్రస్తావిస్తూ ఉంటె.. వాటిని అధిగమించడం కష్టం అవుతుంది. ఇక ఎప్పుడైనా అవమానానికి గురి అయ్యినా.. ఆ విషయాన్ని కూడా భార్యకి పొరపాటున కూడా చెప్పకూడదట. ఇలాంటివి చెప్తే.. ఆమె తన భర్తని చులకనగా చూడడం మొదలుపెడితే.. అది భార్యా భర్తల మధ్య అపార్ధాలు, పొరపొచ్చాలు రావడానికి దారి తీస్తుంది. అందుకే ఇవి చెప్పకూడదట. ఇంకా, మీరు ఎవరికైనా సహాయం చేయాలనీ అనుకుంటే.. ఆ విషయాన్నీ కూడా మీ భార్యకి చెప్పకూడదట. ఎందుకంటే.. ఆమె మీ సహాయాన్ని అడ్డుకోవచ్చు. లేదా మీరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయమని కోరవచ్చు. ఈ రెండు ఇబ్బందికర పరిణామాలకు దారి తీస్తాయి కాబట్టి వీటి గురించి చెప్పకపోవడమే మంచిది.
Read More:
యానిమల్ సినిమాపై వైరల్ అవుతున్న మీమ్స్.. చూస్తే నవ్వాపుకోలేరు!
మరీ ఇంత బలుపులేంట్రా ? ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి కప్ గెలిచిన ఆనందం లో ఇండియా ని ఇలా అవమానించారా ?