Advertisement
భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్త రించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తుంది. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి రంగులు గురించి ఏ ఒక్కరూ ఆలోచించి ఉండరు.
Advertisement
అయితే పగటిపూట కన్నా రాత్రిపూట రైలు వేగం పెరుగుతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రైలు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువ వేగంతో నడుస్తుండటానికి చాలామంది గమనించే ఉంటారు. రాత్రిపూట రైళ్లు అతివేగంతో నడపడానికి కారణం ఏమిటి? దీని వెనుక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రివేళలో రైలు వేగం పెరగడం వెనుక అనే కారణాలు ఉన్నాయి. దీనికి మొదటి కారణం. రాత్రి వేళల్లో రైల్వే ట్రాక్ పై కదలికల పరిధి దాదాపు తక్కువగా ఉండడమే. చీకటి పడితే రైల్వే ట్రాక్ పై మనుషులు, జంతువుల సంచారం ఉండదు. అంతేకాకుండా రాత్రివేళల్లో ట్రాక్ పై ఎలాంటి నిర్వహణ పనులు కూడా జరగవు.
Advertisement
దీనికి కారణంగా రాత్రి వేళల్లో రైలు వేగం ఎక్కువగా ఉంటుంది. చీకట్లో రైలును నడపడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, చాలా దూరం నుండి సిగ్నల్స్ చూడవచ్చు. రైలును ఆపివేయాల వద్ద అనేది రైలు డ్రైవర్ కి అంటే లోకో పైలట్ కి దూరం నుండే తెలిసిపోతుంది. దీంతో లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. దీంతో రాత్రిపూట రైలు నిరంతరంగా అధిక వేగంతో నడుస్తుందని అర్థం చేసుకోవచ్చు. పగటిపూట ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఉదయం వేళ రైల్వే ట్రాక్ పై ఎవరో ఒకరు తిరుగుతుంటారు. అటువంటి పరిస్థితిలో లోకో పైలట్ పగటిపూట మరింత అప్రమత్తంగా రైలును నడపాల్సి ఉంటుంది.
Read also: పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..?