Advertisement
సాధారణంగా చాలామంది ఇంటి చుట్టూ పరిసరాల్లో మొక్కలు నాటుతూ ఉంటారు. ఈ విధమైన మొక్కలు నాటడం గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం పట్టణాల్లో కూడా ఇంటి వరండాలో ఇతర ఖాళీ ప్లేస్ లో మొక్కలను పెంచుతున్నారు.. మొక్కలను పెంచడం వల్ల బాగుండడమే కాకుండా, ఇంటి చుట్టూ కూడా అందంగా ఉంటుంది. అయితే ఈ మొక్కల్లో కూడా కొన్ని మొక్కలను నాటితే ఇంట్లో అశాంతి నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎలాంటి మొక్కలను ఇంట్లో పెంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
also read: ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న పదిమంది హీరోలు… ఎవరంటే…?
మర్రిచెట్టు :
ఇంటి ఆవరణలో మర్రి చెట్టును అస్సలు నాటకూడదట. ఎందుకంటే మర్రిచెట్టు దారిద్రానికి సాంకేతంగా చెబుతుంటారు. దాని యొక్క ఊడలు ఇంటిని నాశనం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
also read: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని టాలీవుడ్ సెలెబ్రెటీల 25 +పెళ్లి ఫోటోలు !
Advertisement
రావి చెట్టు :
చాలామంది రావి చెట్టును పూజిస్తూ ఉంటారు. ఇది ఆక్సిజన్ కు ఉత్తమ వనరుగా చెప్పబడింది. కానీ మీరు మీ ఇంటి ఆవరణలో ఈ చెట్టు నాటితే వినాశనమేనట. ఒకవేళ ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉంటే దాని చుట్టూ గోడ కట్టి ప్రతిరోజు దీపం వెలిగిస్తే దరిద్రం దరిదాపుల్లోకి రాదని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఖర్జూర చెట్టు :
ముఖ్యంగా ఇంటి దగ్గర ఖర్జూర చెట్టును అస్సలు నాటకూడదట. దీనివల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
రేగు చెట్టు:
ఇంటి పరిసరాల్లో కానీ ఇంటి తోటలో కానీ రేగు చెట్టుని ఎప్పుడు నాటకూడదట. ఇది అశుభానికి సంకేతం. ఇది ఇంటి పరిసరాల్లో నాటడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని వారు అంటున్నారు.
also read: తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు