Advertisement
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానులు ఎంతలా ఎదురు చూస్తారో మనం చెప్పక్కర్లేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్సాహం తో చూస్తారు. అదే వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఇక క్రేజ్ మాములుగా ఉండదు. ఓ లెవెల్ లో ఎదురు చూస్తారు ఫ్యాన్స్. ఈసారి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగుంది. అక్టోబర్ 15 న అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరగనుంది. అందుకోసం అభిమానులు విపరీతంగా ఎగబడుతున్నారు. చాలా మంది దూర ప్రదేశాల నుంచి రావడానికి రెడీ అవుతారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ మ్యాచ్ కోసం చేసుకుంటున్నారు. పైగా ఇప్పటికే హోటల్ రూమ్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.
Advertisement
Advertisement
డిమాండ్ ఎక్కువ ఉండడం తో అహ్మదాబాద్ హోటల్ యజమానులు కూడా ధరల్ని బాగా పెంచేసారు. యావరేజ్ హోటల్ కి కూడా 50,000 వరకు వసూలు చేస్తున్నారు. స్టార్ హోటల్స్ లో అయితే లక్ష రూపాయలు పెడితే కానీ రూమ్ లేదు. చాలా దాకా హోటల్లో బుకింగ్ ఫుల్ అయిపోయాయి. దానితో స్టేడియం చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ బెడ్స్ ని బుక్ చేస్తున్నట్టు ఆసుపత్రి యజమానులు తెలియజేస్తున్నారు. హాస్పిటల్లో బెడ్ ఇవ్వడానికి సుమారు రోజుకు మూడు నుంచి 25000 వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హోటల్స్ లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకోవాలని ఆసుపత్రుల్లో బెడ్స్ ని బుక్ చేసుకుంటున్నారట.
Also read: