Advertisement
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ప్రేమ గురించి పెళ్లి గురించి మనకి తెలిసిన విషయాలే. సోనియా రాజీవ్ గాంధీ పెళ్లి ఈజీగా జరగలేదుట. సోనియా కుటుంబానికి భారతీయ అబ్బాయికి తన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఈ విషయాన్ని సోనియా గాంధీ జీవిత చరిత్రలో ప్రస్తావించారు. రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీ కూడా తన కోడలిగా సోనియా గాంధీని మొదటి ఆప్షన్ కింద అనుకోలేదు. ఒక పుస్తకం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. రాజీవ్ గాంధీకి దేశంలోని ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి జరపాలని ఇందిరాగాంధీ అనుకున్నారట. రాజకీయాల్లో అత్యంత ప్రభావితమైన గాంధీ నెహ్రూ ఫ్యామిలీ అలానే సినీ ప్రపంచంలోని కపూర్ కుటుంబం ఒకప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా ఉండేదట.
Advertisement
Advertisement
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ కి రాజ్ కపూర్ పెద్ద కూతురుతో పెళ్లి జరపాలని అనుకున్నారు. నిజానికి ఈ విషయం గురించి చాలామందికి తెలీదు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రముఖ బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ మధ్య స్నేహం ఉండేదిట రషీద్ కిద్వాయి తన పుస్తకంలో ఈ విషయాన్ని తెలిపారు. అందుకనే ఇందిరాగాంధీ కూడా కపూర్ కుటుంబాన్ని బాగా గౌరవించేవారు. ఇరు కుటుంబాల మధ్య ఫ్రెండ్లీ నేచర్ ఉండేది. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని భావించారు పుస్తకంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. అయితే స్నేహాన్ని కాస్త బంధుత్వంగా మార్చుకోవాలని ఉద్దేశంతో పెద్ద కొడుకు రాజీవ్ గాంధీకి రాజ్ కపూర్ పెద్ద కూతురు రీతు కపూర్ తో పెళ్లి చేయాలని ఇందిరా గాంధీ అనుకున్నారు కానీ ఇందిరా గాంధీ కోరిక మాత్రం నెరవేరలేదు రాజీవ్ గాంధీ చదువుల కోసం బ్రిటన్ వెళ్లారు అక్కడ సోనియా ని కలిశారు.
వాళ్ళిద్దరూ ప్రేమించుకుని 1968లో మ్యారేజ్ చేసుకున్నారు. రాజ్ కపూర్ మనవరాలు బాలీవుడ్ నటి కరీనాకపూర్. 2002లో రాజీవ్ సోనియా దంపతులు కొడుకు రాహుల్ గాంధీ అంటే తనకి ఇష్టమని అన్నారు కూడా. రషీద్ కిద్వాయి తన పుస్తకంలో ఇది కూడా చెప్పారు కరీనాకపూర్ 2002లో రాహుల్ గాంధీని మొదటి ఆప్షన్ గా పెట్టుకున్నారుట కరీనా నటించిన మూవీస్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి రాహుల్ గాంధీ ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవారు. ఒకసారి ఎవరితో డేట్ చేయాలనుకుంటున్నారు అని కరీనాకపూర్ ని అడిగితే రాహుల్ గాంధీ పేరు చెప్పారట. రాజీవ్ గాంధీ తో తొలిచూపులోనే సోనియా ప్రేమలో పడ్డారట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!