Advertisement
ఈటివి విండోస్ ఓటిటిలో రిలీజ్ అయిన “90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్” వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించిన చర్చలే నడుస్తున్నాయి. శివాజీ, వాసుకీలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, వారి పిల్లలుగా మౌళి తనుజ్ ప్రశాంత్, వాసంతిక, ఆదిత్య లు నటించారు. శివాజీ, వాసుకి పెయిర్ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. వారి జోడి అదిరిపోయింది అంతే. ఇక, ఈ ముగ్గురు పిల్లలు కూడా చిచ్చర పిడుగులే.
Advertisement
వీరి నటన, వారి తీరు కూడా ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సిరీస్ ను చూడాలి అంటూ దర్శకుడు ముందుగానే వాయిస్ ఓవర్ లో చెబుతాడు. కానీ, ఈ సిరీస్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. చాలా మంది నైన్టీస్ కిడ్స్ ఈ సిరీస్ కి కనెక్ట్ అయిపోతున్నారు. బిగ్ బాస్ తరువాత శివాజీ ఈ సిరీస్ తో మంచి కం బ్యాక్ ఇచ్చినట్లు అయ్యింది. అలాగే.. వాసుకి రీ ఎంట్రీ కి కూడా ఈ సిరీస్ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇక పెద్ద కొడుకుగా నటించిన మౌళి తనుజ్ ప్రశాంత్ “మౌళి టాక్స్” అనే యు ట్యూబ్ ఛానెల్ ద్వారా నెటిజన్స్ కి సుపరిచితుడే. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో సెలెబ్రెటీగా పేరు తెచ్చుకున్న మౌళికి నాలుగు లక్షలకు పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నారు. గతంలో కూడా హాస్టల్ డేస్ అనే ఓ సిరీస్ లో నటించారు.
Advertisement
కూతురు దివ్య పాత్రలో నటించిన వాసంతిక కూడా సలార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. ఆమె ఫ్యూచర్ లో కూడా స్టార్ నటి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక చిన్న పిల్లాడుగా నటించిన ఆదిత్యకి కూడా మంచి పేరు వస్తోంది. ఆదిత్య అసలు పేరు రోహన్ అట. ఇతను గతంలో సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీ అవుతున్నాడు.
Read More:
గుంటూరు కారం ట్రైలర్ లో గురూజీ మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ???