Advertisement
ప్రేమ.. ఈ రెండు అక్షరాలలో ఏముందో తెలియదు కానీ, ఇందులో పడ్డామంటే ఇక మైమరచిపోవాల్సిందే.. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా దీని మత్తులో ఇరికిస్తుంది. అలాంటి ప్రేమలో పడి జీవితంలో సెట్ అయిన వారు ఉన్నారు, అలాంటి ప్రేమకు బలైన వారు ఉన్నారు, అలాంటి ప్రేమను ఇంకా ఆస్వాదిస్తున్న వారు ఉన్నారు.. ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కొంతమంది పెద్దలు కుదిరించిన వివాహం చేసుకున్నారు..
Advertisement
ఏది ఏమైనా ఈ హీరోలకు మరియు వారి భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య జ్యోతిక మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా ఉన్నారు.. ఏడు చిత్రాల్లో కలిసి పని చేసిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకోగా , సూర్య కంటే జ్యోతిక మూడు సంవత్సరాలు చిన్నది. ఇక నాగచైతన్య సమంత జంట ఒకప్పుడు చూడముచ్చటగా ఉండేవారు. అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అయితే నాగచైతన్య సమంత కంటే ఏడాది పెద్ద.
Advertisement
ఇక హీరో వరుణ్ సందేశ్ , వితిక జంట విషయానికి వస్తే వీరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీతికా వరుణ్ కంటే మూడేళ్లు పెద్దది. ఇక నాగార్జున అమల ప్రేమ విషయం అందరికి తెలిసిందే.. లక్ష్మీకి విడాకులు ఇచ్చిన తర్వాత అమలని పెళ్లి చేసుకున్నారు నాగార్జున. అమల నాగార్జున కంటే ఎనిమిదేళ్లు చిన్నది. ఇక రామ్ చరణ్ ఉపాసన కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఉపాసన రాంచరణ్ కంటే 5 ఏళ్లు చిన్నది. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెద్దలు కుదిరిచిన వివాహం. ప్రణతి ఎన్టీఆర్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్నది.
also read: